వరుణిడి కరుణ కోసం ప్రత్యేక పూజలు.. వానలు పడేందుకు కప్ప తల్లి ఆటలు..
జూన్ మూడవ వారంలో కూడా వర్షాలు కురియడం లేదు.వర్షాల కోసం అన్నదాత లు ఎదురు చూస్తున్నారు. తొలకరి పలకరించినా.. తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. దుక్కులు దున్నీ సిద్ధంగా ఉన్నారు రైతులు..కానీ..వర్షం చుక్క లేదు. దీంతో గ్రామాల్లోని రైతులు వరుణుడికి పాలభి షేకం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి గ్రామాల్లో కప్ప తల్లి ఆటలు ఆడుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామస్థులు పురాతన శివాలయంలో శివలింగానికీ జలభిషేకం నిర్వహించారు. లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి..తరువాత జలం తో అభిషేకం నిర్వహించారు. వాటర్ ట్యాంకర్ తో నీళ్లు తెప్పించారు. ఆ నీటిని బిందెలలో నింపి వరుసగా నిలబడి నింపిన బిందెలు ఒకరి చేతుల మీదుగా అందుకొని పూజారుల ఆధ్వర్యంలో శివలింగాన్ని జలంతో పూజలు నిర్వహించారు.
“వర్షాలు పడకపోతే..పంటలు ముందుకు సాగవని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని యువత వర్షాలు రావాలన్న ఆశతో కప్పతల్లి ఆడి, సాంప్రదాయిక నృత్యం చేశారు. పూజతో పాటు..కప్పల తో ఊరేగించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్పలను కట్టి ఆ సంచిని రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఇండ్ల వద్దకు వచ్చిన వారికి ప్రతీ ఒక్కరూ బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు.
ఇప్పటికే..పలు చోట్ల ఆరు తడి పంటలు సాగు చేశారు.అయితే..సరిగా వర్షాలు లేకపోవడం తో..పంటలు ఎండిపోతున్నాయి అంతే కాకుండా..నార్లు పోయాలంటే..రైతులు ఆలోచిస్తున్నారు.దేవుడు కరుణించి. వర్షాలు కురియాలని..రైతు లు కోరుతున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




