AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanti Velugu: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..? 

గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Kanti Velugu: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ కంటి వెలుగు కార్యక్రమం.. ఎప్పటినుంచంటే..? 
Kanti Velugu Program
Shaik Madar Saheb
|

Updated on: Nov 18, 2022 | 7:31 AM

Share

Kanti Velugu programme: తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాలను పరిశీలించారు. ప్రజారోగ్యం, వైద్యం, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ (CM KCR) గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు అందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కండ్లజోడులు అందించిందని తెలిపారు. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవంటూ పేర్కొన్నారు.

పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి.. కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సిబ్బందిని, కండ్లద్దాలు, పరికరాలు తదితర అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. దాదాపు 40 లక్షల మందిచి కళ్లజోళ్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని.. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

దీంతోపాటు రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, పాడైన వాటికి మరమ్మతులతో పాటు పనుల నాణ్యత విషయంపై సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు మంచిగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు, మరమ్మతులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..