TS WDSCD Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు..
తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ పరిధిలోని ట్రాన్స్‌జెండర్ల హెల్ప్ డెస్క్‌లో.. హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ పరిధిలోని ట్రాన్స్‌జెండర్ల హెల్ప్ డెస్క్‌లో.. హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హతతోపాటు, హ్యుమానిటీ, సోషల్ వర్క్, సైకాలజీ, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ స్వచ్ఛంద సంస్థల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అలాగే అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్ధులకు నెలకు రూ.26,749ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The Director, Welfare of Disabled and Senior Citizens (WD&SC), Vikalangula Salkshema Bhavan, Nalgonda X Road, Malkper, Hyderabad-500036.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.