AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్ అత్యవసర భేటీ.. మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేసే ఛాన్స్..!

ఏదో తేడా కొడుతోంది.. మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ నెలన్నర రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటి చేస్తున్న పోరాటం ఫలించింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేందుకు కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం సిద్ధమైంది.

Telangana: కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్ అత్యవసర భేటీ.. మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేసే ఛాన్స్..!
Kamareddy Municipolity
Shiva Prajapati
|

Updated on: Jan 20, 2023 | 8:15 AM

Share

ఏదో తేడా కొడుతోంది.. మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ నెలన్నర రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటి చేస్తున్న పోరాటం ఫలించింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేందుకు కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం సిద్ధమైంది. కాసేపట్లో కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి ప్రకటించారు. దీంతో కొన్నాళ్లుగా జరుగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు స్థానిక రైతులు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లతో పాటు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలన్న డెడ్ లైన్ విధించింది.

రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఒత్తిడి మేరకు బీజేపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్ కు పంపారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కూడా షబ్బీర్ అలీకి రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన 8మంది రాజీనామాకూ షబ్బీర్అలీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ కౌన్సిలర్లపైనా ఒత్తిడి పెరిగింది.

ఇవి కూడా చదవండి

రైతు జేఏసీ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని కూడా పిలుపునిచ్చింది. ఈ విషయంపై చర్చించిన అధికార పార్టీ నేతలు.. ఇవాళ మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలనీ… ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. తమది రైతు ప్రభుత్వమనీ.. తామొకటి పంపితే అటు నుంచి మరో ముసాయిదా వచ్చిందనీ. తమకు రైతులకు ద్రోహం చేయాలన్న ఆలోచనే లేదని అంటోంది కామారెడ్డి పాలక వర్గం. అందువల్లే రైతులకు అనుకూలంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు