Hyderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి కారణమేంటి? బాధ్యులెవరు? జీహెచ్ఎంసీ ఏం చేస్తోంది?

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఫైర్‌ ఫైటర్స్‌కి చాలెంజింగ్‌గా మారింది. ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లో కంట్రోల్‌ చేసే సిబ్బంది.. గంటలు తరబడి శ్రమించినా అదుపులోకి రాని పరిస్థితి.

Hyderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి కారణమేంటి? బాధ్యులెవరు? జీహెచ్ఎంసీ ఏం చేస్తోంది?
Secunderabad Fire Accident
Follow us

|

Updated on: Jan 20, 2023 | 8:35 AM

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఫైర్‌ ఫైటర్స్‌కి చాలెంజింగ్‌గా మారింది. ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లో కంట్రోల్‌ చేసే సిబ్బంది.. గంటలు తరబడి శ్రమించినా అదుపులోకి రాని పరిస్థితి. ఇంతకీ ప్రమాదానికి కారణాలేంటి? ప్రమాదం జరిగినా.. అదుపు చేయలేని విధంగా బిల్డింగ్ ఉందా? ఆ రకమైన వస్తువులు అక్కడ నిల్వచేశారా? స్పెషల్ ఫోకస్..

1. ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. ముందుగా సెల్లార్‌ నుంచి పొగలు వచ్చాయి. అక్కడి నుంచి ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్లకు వ్యాపించాయి. వైర్లు కాలిపోతున్న శబ్ధంతో మంటలు లేచాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బిల్డింగ్‌ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. షార్ట్ సర్క్టూట్‌ సెల్లార్‌లోనే జరిగిందా? మిగతా ఫ్లోర్లలో కూడా జరిగిందా అన్నది ప్రశ్న.

2. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కార్ల షోరూంకి చెందిన గోదాం, మిగతా ఫ్లోర్లలో స్పోర్ట్స్‌ వేర్‌కి సంబంధించి సామాగ్రి ఉంది. మండే స్వభావం అధికంగా ఉండే లెదర్‌, పెట్రోల్‌, డైక్రోలో ప్రొఫేన్‌ కెమికల్, రెగ్జిన్, ప్యాబ్రిక్‌ మెటిరీయల్ నిల్వలు మంటలకు కారణం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

3. డెక్కన్‌ మాల్‌లో కెమికల్స్ మంటల ఉధృతికి కారణం అయ్యాయి. కెమికల్ బాక్స్‌లు పేలడం మరింత ఆజ్యం పోసింది. మంటలు ఆరే క్రమంలో దట్టమైన పొగ ఉవ్వెత్తున ఎగసిపడింది. పరిసర ప్రాంతమంతా దావానంలా వ్యాపించింది. ఏం జరుగుతుందోనని స్థానికులంతా వణికిపోయారు.

4. రెగ్జిన్, ఫ్యాబ్రిక్ మెటిరీయల్‌ నిల్వలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే నిమిషాల వ్యవధిలో మంటలు అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. భారీ ఆర్డర్లతో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు కొంప ముంచిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

5. భవన నిర్మాణంలో ఫైర్ సేఫ్టి నిబంధనలను గాలికొదిలేశారు. బిల్డింగ్‌కి బిల్డింగ్‌కి మధ్య కనీసం ఐదారు అడుగుల దూరం కూడా లేదు. అయినా పర్మిషన్ ఇచ్చారు. ఎలాంటి నిబంధనలు పట్టించుకోకుండా నిర్మాణం సాగినట్టు స్పష్టమవుతోంది.

6. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే.. కనీసం ఫైరింజన్‌ వెళ్లే మార్గం లేదు. ఇంత పెద్ద బిల్డింగ్‌కి పర్మిషన్ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఫైరింజన్‌ బిల్డింగ్‌ దగ్గరకు వెళ్తే మంటలు సకాలంలో అదుపులోకి వచ్చేవి. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో గంటలకొద్ది మంటలు మంట పుట్టిస్తున్నాయి.

7. జీహెచ్ఎంసీ.. జీ ప్లస్‌ ఫోర్‌కు పర్మిషన్ ఇచ్చింది. కానీ 6 ఫ్లోర్లు నిర్మించారు. బిల్డింగ్‌ మీద బిల్డింగ్‌ నిర్మించారే తప్ప.. కనీస నిబంధనలు పాటించలేదు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం జరిగేదా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

8. అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యం. ఒకవేళ ప్రమాదం నివారించడం ఎలా? ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించేది ఎలా అన్న సంగతిని యాజమాన్యం విస్మరించింది.

9. అధికారుల అలసత్వం మరో కారణంగా కనిపిస్తోంది. పర్మిషన్ ఇచ్చేశాం.. ఆ తర్వాత మాకెందుకులే అన్నట్టు వ్యవహరించారు. ఇంత పెద్ద బిల్డింగ్‌ నిర్మాణంలో నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది గమనించినట్టు లేదు.

10. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు.. అందరి అలసత్వం అతిపెద్ద ప్రమాదానికి కారణంగా కళ్ల ముందు కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..