Telangana: ‘వెంట్రుకలే లేవనుకున్నా.. మెదడు కూడా లేదు’.. బండి సంజయ్‌పై మంత్రి సంచలన కామెంట్స్..

ఖమ్మం బీఆర్ఎస్ సభపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

Telangana: ‘వెంట్రుకలే లేవనుకున్నా.. మెదడు కూడా లేదు’.. బండి సంజయ్‌పై మంత్రి సంచలన కామెంట్స్..
Errabelli Dayakar Rao
Follow us

|

Updated on: Jan 20, 2023 | 9:21 AM

ఖమ్మం బీఆర్ఎస్ సభపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తెలంగాణ లాంటి పథకాలు, అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా అంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిని పరిశీలించేందుకు ఏ రాష్ట్రానికి తాము వచ్చేందుకు సిద్ధమన్నారు మంత్రి ఎర్రబెల్లి.

ఖమ్మం సభకు కుమారస్వామి ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు టీపీసీసీ రేవంత్‌రెడ్డి. రేవంత్ ప్రశ్నపై మండిపడ్డారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. రేవంత్ విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందు కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవాలంటూ సూచించారు. ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని విమర్శించారు ఎర్రబెల్లి. ఖమ్మం సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్‌ అయిందన్నారు. సభపై అవాకులు, చెవాకులు పేల్చిడం సరికాదన్నారు ఎర్రబెల్లి.

మీకెందుకు అంత ఈర్ష్య..

దేశాన్ని అభివృద్ధిబాటలో పయనించేలా చేసే శక్తి, దమ్ము సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు చేసిన అభివృద్ధి, తెలంగాణలో తాము చేసిన అభివృద్ధిపై చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు మంత్రి. ‘మిషన్ భగీరథపై చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై వస్తారా? మీ ఇష్టం. దేశమంతటా ఉచిత కరెంటు ఇస్తుంటే మీకెందుకు ఈర్ష్య? దేశంలో దళితులకు దళితుల బంధు ఇస్తామని చెబుతుంటే మీకెందుకు అసూయ? విభజన హామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమయ్యాయి? రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు? రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్న వాటా ఎంత? దేశం మొత్తం సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటుంటే ఈర్ష్య ఎందుకు? ఖమ్మం మీటింగ్‌కు హాజరైన సీఎంలు.. కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటామని ప్రకటించారు. రైతుబంధు, మిషన్ భగీరథ వంటి తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తోందని సీఎంలు సైతం తెలిపారు. బండి సంజయ్.. ఇంతకాలం నీ తలపై వెంట్రుకలు మాత్రమే లేవని అనుకున్నాం.. కానీ, నీ తలలో మెదడు కూడా లేదు. కళ్లకు పొరలు కమ్మినట్లున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకంలో భాగంగా పరీక్షలు చేయించుకో. ఉచితంగా అద్దాలు ఇస్తారు. అవి పెట్టుకుని చూడు. క్రికెట్ మ్యాచ్ తప్ప ఖమ్మం మీటింగ్ గురించి ఎవరూ పట్టించుకోలేదా? ఆటకు మాటకు తేడా తెలియని రాజకీయ పసికూనలు మీరు. మీటింగ్‌కు జనాలే రాలేదా? వచ్చిన ప్రజలు కూడా మనస్ఫూర్తిగా రాలేదా? వారేమైనా మీకు వచ్చి చెప్పారా? బెదిరించి రప్పించడానికి మేమేమీ బీజేపీ వాళ్లం కాదు.’’ అంటూ బండి సంజయ్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇవి కూడా చదవండి

వస్తే మీకేంటి? రాకుంటే మీకేంటి?

కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదని అంటున్నారు. ఎవరు వస్తే మీకేంటి? ఎవరు రాకుంటే మీకేంటి? మీకెందుకు అంత ఆత్రుత. కుమార స్వామి కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సీఎం నితీష్ బిజీగా ఉన్నారు. మీలా అందరూ ఖాళీగా ఉండరు కదా? జాతీయ నాయకులను చౌకబారు మాటలతో దూషించడం మంచి సంస్కృతి కాదు. అసలు మీది నోరా? మోరా? ఏ రోజైనా మీ నోటించి ఒక్క మంచి మాటైనా వచ్చిందా? రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని తొండి సంజయ్ అంటున్నారు. కరెంట్‌పై డౌట్ ఉంటే.. వెళ్లి ఓ కరెంట్ వైర్‌ని పట్టుకో. అప్పుడు తెలుస్తుంది. బండి సంజయ్ భాష వినడమే పెద్ద ఇబ్బందిగా ఉంది. మళ్లీ వీరు కేసీఆర్‌ను అంటారు. ఎలా మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞానులు. అయినా బీఆర్ఎస్ ఏం చేస్తే మీకెందుకు.. ముందు మీరు మీ బీజేపీ గురించి చూసుకోండి.’’ అంటూ బండి సంజయ్‌కి చురకలంటించారు మంత్రి ఎర్రబెల్లి.

తెలంగాణకు కిషన్ రెడ్డి చేసిందేంటి?

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు బీజేపీ చెప్పిన మేకిన్ ఇండియా అనేది పెద్ద జోక్ అని పునరుద్ఘాటించారు మంత్రి ఎర్రబెల్లి. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏం తెచ్చారు ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడం చేతకాదు కానీ, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ను మాత్రం దూషిస్తారని దుయ్యబట్టారు. జల వివాదాలను సృష్టించిందే మీరని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయని కిషన్ రెడ్డి అంగీకరించారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. అయితే, ఈ అభివృద్ధి కేంద్ర నిధులతో కాదని, రాష్ట్ర హక్కుగా వస్తున్న ఫైనాన్సి కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.

కేంద్రం వల్లే తెలంగాణలో పల్లెలు అభివృద్ధి చెందాయని అంటే.. దేశంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి కదా? మరి ఎందుకు అలా జరుగడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి. ‘కిషన్ రెడ్డి ముందుగా చైనా ఆక్రమిస్తున్న భారత భూభాగం గురించి మాట్లాడాలి. రైతులపై కాల్పుల గురించి మాట్లాడాలి. ఆకలి కేకలపై మాట్లాడాలి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ గురించి మాట్లాడాలి. దేశంలో ఏటా ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడాలి. బ్లా్క్ మనీ తెచ్చి రూ. 15 లక్షలు ప్రజల ఖాతాల్లో వేస్తామన్న మాటల గురించి మాట్లాడాలి.’ అంటూ పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి.

రేవంత్‌ రెడ్డికి నెక్ట్స్ లెవెల్ కౌంటర్..

‘కాంగ్రెస్‌ను ఓడించేందుకు సుపారీ ఇచ్చేంత సీన్ లేదు. ఆ పార్టీని ఓడించడానికి బయటివాళ్లు కూడా అవసరం లేదు. మీ పార్టీ నేతలే చాలు. మీరు చేసే వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. సుపారీల వ్యవహారాలు నడిపేది నువ్వు. ముందు నీ పార్టీని నువ్వు కాపాడుకో. దేశంలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. బీజేపీ దేశానికి భారంగా మారింది. ఈ రెండు పార్టీల నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఇక వీరి ఆటలు చెల్లవు. ఖమ్మం మీటింగే ఇందుకు ఉదాహరణ.’ అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

దేశమంతా ఉచిత కరెంట్..

తెలంగాణలో ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగానే దేశమంతా ఇస్తాం. విద్యుత్ రంగాన్ని అదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తాం. అలాగే రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు ఉంటుంది. మేక్ ఇండియా పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలిసిందే. ఇద్దరు గుజరాతీలు దేశ సంపదనంతా మరో గుజరాతీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటాం.’ అని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి.

ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్..

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. తాను ఇప్పటి వరకు చూసి మీటింగ్స్ అన్నింటిలోనూ ఖమ్మం మీటింగ్ అద్భుతం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ విజయవంతం అయ్యిందన్నారు. జాతీయ నేతల రాకతో బీఆర్ఎస్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఖమ్మం సభను దేశ ప్రజలు ఆసక్తిగా వీక్షించారని పేర్కొన్నారు మంత్రి. కేసీఆర్ దేశానికి అవసరం అని దేశ ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో రైతులకు న్యాయం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. లక్ష్యం దాటి ఖమ్మం సభకు జనాలు తరలివచ్చారని, గంటల తరబడి నిరీక్షించారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారన్నారు. ప్రధానిగా ఉన్న మోదీ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతుండగా, సీఎం కేసీఆర్ తల్లీ, తండ్రిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఖమ్మం సభను చూసి విపక్షాల వెన్నులో వణుకు పడుతోందని, అందుకే అడ్డమైన కామెంట్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయకార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో