Vande Bharat Express: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్‌కు మరో వందేభారత్ రైలు.? వివరాలు ఇవిగో.!
తెలుగు రాష్ట్రాల మధ్య మొదటి 'వందేభారత్ ఎక్స్‌ప్రెస్' రైలు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. జనవరి 15న..

తెలుగు రాష్ట్రాల మధ్య మొదటి ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ ప్రారంభమైంది. ఇక త్వరలోనే మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ మార్గంలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే.. తన పరిధిలో ఉన్న మొత్తం ఆరు డివిజన్లలోని రైల్వే లైన్లను అప్‌గ్రేడ్ చేసింది. అటు తెలంగాణలోని పెద్దపల్లి-కరీంనగర్, కరీంనగర్-జగిత్యాల, జగిత్యాల-నిజామాబాద్ రూట్లలో వందేభారత్‌కు అనుగుణంగా ఎస్‌సీఆర్ వేగాన్ని కూడా పెంచింది. ఒకవేళ ఆయా రూట్లలో ఈ ట్రైన్ నడపగలిగితే.. సికింద్రాబాద్ నుంచి ముంబై లేదా పూణేకు మూడు లేదా నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైతే.. అటు నేత, వలస కార్మికులతో పాటు ప్రతీ రోజూ హైదరాబాద్ నుంచి విదర్భ ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. గతంలోనూ మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇదే ప్రస్తావించిన విషయం విదితమే. కాగా, దేశంలోని దాదాపు 20కిపైగా ఉన్న ప్రధాన నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ఇంటర్ కనెక్ట్ చేయాలన్నది కేంద్ర రైల్వేశాఖ భావిస్తుండగా.. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్ మార్గాలు కూడా ఉండటం గమనార్హం.