భారతదేశమంతటా 88 కేసులు.. నిందితుడ్ని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
నమ్మిన బాధితుడు తొలుత ఆ యాప్‌లో సూచించిన పలు బ్యాంకు ఖాతాల్లో కొద్ది మొత్తంలో నగదు పెట్టాడు. అందులో రోజూవారి లాభం చూపించారు. బాధితుడ్ని నమ్మించడానికి, ఆ లాభాల మొత్తాన్ని వారి అప్లికేషన్ వాలెట్ లోకి జమ చేస్తామని, దానిని 2, 3 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలోకి జమ చేసుకోవచ్చని నిందితులు బాధితుడికి చెప్పారు. ప్రతి విత్‌డ్రాపై 6 శాతం పన్ను మినహాయింపు కూడా ఉంటుందని, ఆ తర్వాత 1 నుంచి 3 రోజుల్లో ఆ మొత్తం బాధితుడి ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.

ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న ఓ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నైరుతి ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై భారతదేశం అంతటా 88 కేసులు, తెలంగాణలో ఏడు కేసులు ఉన్నాయి. నకిలీ బ్యాంకు ఖాతాలు సరఫరా చేయడంతో, OTP ఆపరేటర్‌గా పనిచేస్తున్న నీరజ్ (31) ను పోలీసులు అరెస్టు చేసి, ల్యాప్‌టాప్, ఆరు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, బ్యాంక్ డెబిట్ కార్డులు, చెక్ బుక్‌లు, సిమ్ కార్డులు, రబ్బరు స్టాంపులు, OTP డిటెక్టర్లు, UPI QR కోడ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నగరానికి చెందిన బాధితుడికి అతని మిత్రుడు ఒక లింక్ పంపాడు. https://www.costata.site/appCosta/ అనే ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాప్ డౌన్‌లోడ్ చేసుకుని బాగా లాభాలు గడించవచ్చని చెప్పాడు. నమ్మిన బాధితుడు తొలుత ఆ యాప్‌లో సూచించిన పలు బ్యాంకు ఖాతాల్లో కొద్ది మొత్తంలో నగదు పెట్టాడు. అందులో రోజూవారి లాభం చూపించారు. బాధితుడ్ని నమ్మించడానికి, ఆ లాభాల మొత్తాన్ని వారి అప్లికేషన్ వాలెట్ లోకి జమ చేస్తామని, దానిని 2, 3 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలోకి జమ చేసుకోవచ్చని నిందితులు బాధితుడికి చెప్పారు. ప్రతి విత్‌డ్రాపై 6 శాతం పన్ను మినహాయింపు కూడా ఉంటుందని, ఆ తర్వాత 1 నుంచి 3 రోజుల్లో ఆ మొత్తం బాధితుడి ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. దీంతో బాధితుడు రూ. 6,16,918 పెట్టుబడి పెట్టాడు. అయితే కొన్ని రోజుల తర్వాత నిందితులు విత్‌డ్రా ప్రాసెస్ ఆపేశారు. కాంటాక్ట్ అవుదామని ప్రయత్నించిన ఉపయోగం లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని అరెస్టు చేశారు.
మీరు సైబర్ క్రైమ్ మోసానికి గురైతే, వెంటనే 1930 కు డయల్ చేయండి లేదా సహాయం కోసం https://cybercrime.gov.in/ ని సందర్శించండి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..