AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పారాహుషార్.. నగరంలో కొత్త దొంగలు.. దొంగతనం దర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి

చీరలను మాత్రమే దొంగతనాలకు పాల్పడుతుంది ఈ ముఠా. అనంతరం యాదగిరిగుట్ట వెళ్లి దర్శనం చేసుకుంటారు. తాజాగా ఈ ముఠాను మియాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఏసీపీ శ్రీనివాస్​ కుమార్ వెల్లడించారు.

Hyderabad: పారాహుషార్.. నగరంలో కొత్త దొంగలు.. దొంగతనం దర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి
Sarees
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 12, 2025 | 10:01 PM

Share

భద్రం బీ కేర్‌ ఫుల్. ఈ హెచ్చరిక హైదరాబాద్ నగరంలోని దుస్తులు షాపుల వాళ్లకు ఇస్తున్నాం. నగరంలో కొంతమంది మహిళలు చొరబడ్డారు. వారు షాపుల్లో చీరల దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి లక్ష్యం.. చీరలు మాత్రమే. అలా అని యజమానులు, సిబ్బందులకు ఎలాంటి హాని కూడా తలపెట్టరు. వారికి మాటలు చెబుతూ ఏ మాత్రం అనుమానం రాకుండా.. అక్కడి చీరలు సర్దేస్తున్నారు. డైవర్డ్ చేసి మాయ చేసి సరుకు దోచుకు వెళ్లిపోతారు. ఆ చీరను బయటకు తక్కువ రేట్లకు అమ్మి నగదు అర్జిస్తున్నారు. ఆ తర్వాత పాప పరిహారం కోసం యాదగిరి గుట్ట వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తాజాగా వీరిలో కొందరిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం వివరాలను ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మందితో కూడిన ఒక ముఠా హైదరాబాద్​లో చీరల దొంగతనాలకు పాల్పడుతోందని ఏసీపీ శ్రీనివాస్​ కుమార్ చెప్పారు. వీరు చీరల దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాలోని సభ్యులు ఐదుగురు, ఆరుగురు సభ్యులుగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్, మియాపూర్, మధురానగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా సభ్యులపై 10 నుంచి 15 వరకు కేసులు ఉన్నాయన్నారు. ‘ఒక షాపులో చోరీ చేసేముందు ఇన్నోవా వాహనంలో వెళ్లి రెక్కీ చేస్తారు. దొంగతనం చేయగానే యాదగిరి గుట్టకు వెళ్లి దర్శనం తర్వాత మళ్లీ తిరిగి వచ్చి దొంగతనాలు కొనసాగిస్తారు. వీరిలో​కొందరు అరెస్ట్ అయి..జైలుకు వెళ్లి వచ్చినా ప్రరవర్తన మార్చుకోవడం లేద’ని ఏసీపీ చెప్పారు. తాజాగా ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసి.. రెండు లక్షల రూపాయల విలువైన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..