Viral Video: తాగినోడివి గమ్మున ఉండక వాళ్లనేమన్నవ్ బ్రో… బస్సులో నుంచి తన్ని తరిమేసిన మహిళా ప్రయాణికులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు స్కీమ్‌ను లైన్‌లో పెట్టేశారు. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఏ ముహూర్తాన ఈ పథకం అమల్లోకి వచ్చిందేమో గానీ...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు స్కీమ్‌ను లైన్‌లో పెట్టేశారు. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఏ ముహూర్తాన ఈ పథకం అమల్లోకి వచ్చిందేమో గానీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకోవడం వంటి సంఘటనలు పరిపాటిగా మారాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కొంత మంది బస్సుల్లో బ్రష్ చేసుకున్న వీడియోలు, కూరగాయలు కట్ చేసిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. అన్నింటి కన్నా మించి ఫ్రీ బస్సులో సీట్ల కోసం చాలా చోట్ల మహిళలు సిగపట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట నవ్వులు తెప్పించాయి. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఓచోట జరుగుతూనే ఉన్నాయి. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని, చీరలు చింపుకున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అయితే.. తాజాగా.. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కాకపోతే కాస్తా రివర్స్ అయింది. ఇక్కడ మహిళ ప్యాసింజర్, మెల్ ప్యాసింజర్లు బస్సులొ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేముల వాడ నుంచి సిద్దపేట రూట్లో బస్సు వెళుతుండగా బస్సులోని మహిళలు ఒక ప్రయాణికుడిని చితక బాదారు. అయితే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రయాణికుడు కూడామహిళల జుట్లు పట్టుకుని, కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించాడు. వాళ్ల మధ్య సీటు కోసం గొడవనో.. మరేంటో కానీ.. మొత్తానికి వీళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్న వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి దాక .. బస్సులో ఆడోళ్లు కొట్టుకొవడం కామన్ గా చూశారు. కానీ ఫస్ట్ టైమ్.. ఆడొళ్లు, మగోళ్లు కొట్టుకొవడం పట్లు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
ఈ వీడియోలోని భాష అభ్యంతరకరంగా ఉందని హచ్చరిక: