Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

ధరణి పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు.

Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
Jp Nadda
Follow us
Aravind B

|

Updated on: Jun 26, 2023 | 4:32 AM

ధరణి పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన నవ సంకల్ప బహింరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ధరణి పోర్టల్‌తో పాటు బీఆర్‌ఎస్ పోర్టల్ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పీఎం ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసే ఇళ్లలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు.

ఉద్యమం చేసి పోరాటి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని.. వారి ప్రయాస అంతా ఫోటోలకే పరిమితమవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ, ఠాక్రే లాంటి పార్టీలు తమ కుటుంబాలను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని ముందుచూపుతోనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. గతంలో దేశంలో 28 శాతం పెదరికం ఉండగా.. ఇప్పుడు 10 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?