CM KCR: సోమవారం మహా కాన్వాయ్‌తో మహారాష్ట్రకు పర్యటనకు సీఎం కేసీఆర్.. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
CM KCR Maharashtra Vist: ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అది కూడా భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్ల ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ జిల్లా స్థాయి నేతలు ఈ భారీ కాన్వాయ్‌లో ఉండనున్నారు. ముందుగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోమవారం నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన జూన్ 26 అంటే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అది కూడా భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్ల ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ జిల్లా స్థాయి నేతలు ఈ భారీ కాన్వాయ్‌లో ఉండనున్నారు. ముందుగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటన పూర్తిగా రోడ్డు మార్గంలోనే సాగనుంది. హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్‌కు సోమవారం సాయంత్రం చేరుకునేలా ప్లాన్ చేశారు. షోలాపూర్‌లో రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
షోలాపూర్‌లోని కొందరు నేతలు పార్టీ కండువ కప్పుకోనున్నారు. ఇందులో స్థానిక నాయకుడు భగీరథ్ బాల్కే బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. షోలాపూర్‌లో చేనేత కార్మికులను ఆయన ఈ సందర్భంగా కలువనున్నారు. రాత్రి అక్కడ బసచేసి మరుసటి రోజు అంటే జూన్ 27 ఉదయం పండరీపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి విఠోభరుక్మిణి ఆయలంలో పూజలు చేయనున్నారు. అనంతరం దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
మహారాష్ట్ర పర్యటన సందర్బంగా పండర్పూర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చూసుకుంటున్నారు. మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం