Road Accident: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

హన్మకొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కటక్షాపూర్‌- ఆత్మకూరు మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది. మేడారంకు వెళ్లి వస్తుండగా కారును టిప్పర్‌ ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది.

Road Accident: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Road Accident
Follow us
Basha Shek

|

Updated on: Jun 25, 2023 | 7:17 PM

హన్మకొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కటక్షాపూర్‌- ఆత్మకూరు మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది. మేడారంకు వెళ్లి వస్తుండగా కారును టిప్పర్‌ ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..