AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఆ దేవుడి అండతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ గెలుపు సాధ్యం..

వారాహి జనసేనాని ప్రచార వాహానం పేరు. వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం. ఈ మాట సాక్షాత్తు జనాసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టులో వాహానానికి పూజలు చేసినప్పుడు చెప్పారు. గతంలో ఘోర ఓటమి‌ నుండి కృంగిపోకుండా తిరిగి పుంజుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ టిడిపి, బిజేపిలతో కలిసి ప్రభుత్వం ఎర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు కొండగట్టు అంజన్న ఆశీస్సులే బలాన్ని చేకూర్చాయని బలంగా నమ్ముతున్నారు.

Pawan Kalyan: ఆ దేవుడి అండతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ గెలుపు సాధ్యం..
Pawan Kalyan
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Jun 06, 2024 | 9:30 AM

Share

వారాహి జనసేనాని ప్రచార వాహానం పేరు. వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం. ఈ మాట సాక్షాత్తు జనాసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టులో వాహానానికి పూజలు చేసినప్పుడు చెప్పారు. గతంలో ఘోర ఓటమి‌ నుండి కృంగిపోకుండా తిరిగి పుంజుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ టిడిపి, బిజేపిలతో కలిసి ప్రభుత్వం ఎర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు కొండగట్టు అంజన్న ఆశీస్సులే బలాన్ని చేకూర్చాయని బలంగా నమ్ముతున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్‎కి కొండగట్టు అంజనేయ స్వామితో ప్రత్యేక అనుబంధం ఉంది. జనసేనాని ఏ మంచి పని మొదలుపెట్టాలన్న కొండగట్టు అంజనేయ స్వామిని సెంటిమెంట్‎గా భావిస్తారు. 2008లో అప్పటి ప్రజారాజ్యం తరుపున ప్రచారం చేసే సమయంలో హై టెన్సన్ వైర్ తగిలి వాహానంపై పడటంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కొండగట్టు అంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వలనే తాను ప్రాణాలతో బయటపడ్డానని అదే రోజు ప్రచారంలో తెలిపారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దృఢంగా విశ్వసిస్తూ కొండగట్టు అలయం నుండే ప్రచార కార్యక్రమాలని ప్రారంభించారు. తన ప్రత్యేక వాహానం వారాహిని కూడ కొండగట్టు అంజనేయస్వామి అలయంలో పూజలు చేపించారు. 2024 ఎన్నికల సమరానికి కొండగట్టు అంజన్న ఆశీస్సులు తీసుకొని ప్రచారానికి సిద్దం అయ్యారు. అధునాతన సిస్టంతో, సిసి కెమెరాలతో వాహానాన్ని తయారు చేయించారు. ఆ ప్రచార రథానికి వారాహీ అని పేరు పెట్టారు. తనకి, తన కుటుంబానికి ఇలవెల్పు అంజనేయస్వామి. అందులోనూ కొండగట్టు అంజన్న అంటే మరీ ఎక్కువ సెంటిమెంట్‎గా భావిస్తారు.

2023 జనవరి 24న కొండగట్టుకి వచ్చి అంజన్నని దర్శించుకోవడమే కాకుండా తన ప్రచార వాహానం వారాహీకి ప్రత్యేక‌ పూజలు చేయించారు. గతంలో ఓ ప్రచార సమయంలో ఓ హై టెన్షన్ వైర్ తెగి తనపై పడిందని అ సమయంలో తనతో‌పాటు‌ ఉన్నవారందరికి షాక్ తగిలిందని.. కానీ కొండగట్టు ‌అంజన్న దయవల్ల తన జుట్టు‌ మాత్రమే కాలింద చెప్పారు. తనకి‌ కొండగట్టు అంజన్న పునర్జన్మ ఇచ్చాడని‌ పవన్ విశ్వసిస్తారు. ఇప్పుడు ‌అంధ్రప్రదేశ్ లో జనసేనాని కూటమి ప్రభుత్వం ఎర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్‎ను ఓడించడంలో కీ రోల్ పోషిండం ఇదంతా కొండగట్టు అంజన్న మహిమనే అని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..