హైదరాబాద్ జూలో బ్లాక్ టికెట్ దందా.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకి చాలా మంది ప్రజలు వెళ్తుంటారు. సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి వెళ్తున్న వాళ్లతో పాటు స్నేహితులతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని వెళ్లే యువత కూడా ఎక్కువే. ముఖ్యంగా జూలో ఉన్న జంతువులను చూడటానికి చిన్నపిల్లలు చాలా ఆసక్తి కనబరుస్తారు. హైదరాబాద్‌లోనే అతి ముఖ్యమైన టూరిజం ప్రాంతంలో అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్న విషయం తాజాగా బయటపడింది. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి ప్రవేశించాలంటే మామూలుగా కనీస ధర రూ.70 ఉంది.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకి చాలా మంది ప్రజలు వెళ్తుంటారు. సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి వెళ్తున్న వాళ్లతో పాటు స్నేహితులతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని వెళ్లే యువత కూడా ఎక్కువే. ముఖ్యంగా జూలో ఉన్న జంతువులను చూడటానికి చిన్నపిల్లలు చాలా ఆసక్తి కనబరుస్తారు. హైదరాబాద్‌లోనే అతి ముఖ్యమైన టూరిజం ప్రాంతంలో అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్న విషయం తాజాగా బయటపడింది. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి ప్రవేశించాలంటే మామూలుగా కనీస ధర రూ.70 ఉంది. కానీ, ఇక్కడ ఓ మహిళా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ టికెట్‌ను రూ.100 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది. అడిగేవారు లేకపోవడమో, జూ సిబ్బంది నిర్లక్ష్యమో తెలియదు కానీ కాసేపు జూలో ఎంజాయ్ చేద్దామని వచ్చే సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. రూ.70 టిక్కెట్‌ను ఆ మహిళా సెక్యూరిటీ గార్డు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు చూపిస్తున్న ఓ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించి జూ యాజమాన్యం విచారణ చేపట్టగా.. అసలేం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 5వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బుకింగ్ కౌంటర్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు వద్దకు గుర్తు తెలియని ఓ సందర్శకుడు వచ్చాడు. అయితే.. అప్పటికే అతని కుటుంబ సభ్యులు టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉన్నారు. దీంతో అతను లైన్‌లో నిలబడి వేచి ఉండే సమయం లేకపోవడంతో టిక్కెట్ కౌంటర్ నుండి ఒక టికెట్ తీసుకురావాల్సిందిగా ఆ మహిళా సెక్యూరిటీ గార్డును కోరాడు. అయితే.. రూ.70/- విలువైన టిక్కెట్ తీసుకొచ్చి ఆమె ఇవ్వగా.. సందర్శకుడు ఆ మహిళా సెక్యూరిటీ గార్డుకి రూ.100/- ఇచ్చి, చేంజ్ ఉంచుకోమని కోరాడు. ఇదంతా లైన్‌లో టికెట్టు కోసం వేచి ఉన్న మరో సందర్శకుడు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో ఆమె సందర్శకులకు బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు కనిపించింది. కానీ, ఇందులో నిజం లేదని అంటున్నారు. అందువల్ల, ఈ వీడియోను సోషల్ మీడియాలో లేదా ఇతర మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయవద్దని కోరారు. ఎందుకంటే, ఇలాంటి తప్పుడు సందేశాన్ని ఎక్కడైనా షేర్ చేసినట్లయితే.. వారు IT చట్టం సెక్షన్ 66A, IPC సెక్షన్లు 499, 501 కింద చట్టరీత్యా శిక్షార్హులుగా పరిగణించబడతారని హెచ్చరిస్తూ సందేశాన్ని ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
