మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల్లో కొత్తపులి ‘జె1’ సంచారం.. సుమారు 200 కి.మీటర్ల వ‌ర‌కు మ‌రోదాన్ని రానివ్వకుండా

మంచిర్యాల జిల్లా చెన్నూరు సబ్ డివిజన్ పరిధిలోని అడవులను కొత్త పులి 'జె1' తన సామ్రాజ్యంగా మార్చుకుంది. నీల్వాయి, కోటపల్లి, కుశ్నపల్లి, చెన్నూరు బీట్ పరిధిలోని సుమారు 200 కిలోమీటర్ల....

మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల్లో కొత్తపులి 'జె1' సంచారం.. సుమారు 200 కి.మీటర్ల వ‌ర‌కు మ‌రోదాన్ని రానివ్వకుండా
tiger reserves
Follow us

|

Updated on: Apr 24, 2021 | 5:41 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు సబ్ డివిజన్ పరిధిలోని అడవులను కొత్త పులి ‘జె1’ తన సామ్రాజ్యంగా మార్చుకుంది. నీల్వాయి, కోటపల్లి, కుశ్నపల్లి, చెన్నూరు బీట్ పరిధిలోని సుమారు 200 కిలోమీటర్ల మేరకు కారిడార్ ఏర్పాటు చేసుకొని మరో దాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా సంచరిస్తోంది. మహారాష్ట్రలోని తడోబా నుంచి నడుముకు చుట్టుకున్న ఉచ్చుతో రెండున్నర సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చిన ‘కె4’ అనే ఆడపులి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని స్థిరపడింది. గత రెండు నెలలుగా అది కనిపించడం లేదు. దీంతో అటవీశాఖ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏటూరునాగారం అడవుల్లో ‘కె4’ పులి ఆచూకీ లభ్యమైంది.

ఈ క్రమంలోనే ఇటీవల స్థానిక అధికారులు జన్నారం పరిధిలోని కవ్వాల్ అడవుల్లో ‘జె1’ అనే మగపులి సంచారాన్ని గుర్తించారు. అయితే, దీని ధాటికి తట్టుకోలేకనే ‘కె4’ పులి ఈ ప్రాంతాన్ని వదిలి ఏటూరునాగారం అడవుల్లోకి వెళ్లిపోయిందని అధికారులు భావిస్తున్నారు. కవ్వాల్ అటవీ ప్రాంతం నుంచి ప్రస్తుతం విశాలమైన చెన్నూరు సబ్ డివిజన్‌కు వచ్చిన ‘జె1’ పులి.. ఇక్కడ రారాజుగా వెలుగొందుతోంది!.

Also Read: కొంప‌ముంచిన చిడ‌త‌ల రామాయ‌ణం… ఒకే గ్రామంలో 100 మందికి పాజిటివ్..

ఈ ఐపీఎల్‌లో బంతి బంతికి బెట్టింగ్.. కేటుగాళ్ల న‌యా ప్లాన్.. ఆట క‌ట్టించిన పోలీసులు