Telangana Corona: కొంప‌ముంచిన చిడ‌త‌ల రామాయ‌ణం… ఒకే గ్రామంలో 100 మందికి పాజిటివ్..

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ టెర్ర‌ర్ మాములుగా లేదు. కాస్త అశ్ర‌ద్ద‌గా ఉన్నా స‌రే.. క‌రోనా వైర‌స్ మాటువేసి మ‌రీ కాటు వేస్తోంది. ర‌క‌రకాల వేరియంట్స్ ఇప్పుడు ద‌డ పుట్టిస్తున్నాయి.

Telangana Corona:   కొంప‌ముంచిన చిడ‌త‌ల రామాయ‌ణం... ఒకే గ్రామంలో 100 మందికి పాజిటివ్..
Coronavirus.
Follow us

|

Updated on: Apr 24, 2021 | 3:41 PM

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ టెర్ర‌ర్ మాములుగా లేదు. కాస్త అశ్ర‌ద్ద‌గా ఉన్నా స‌రే.. క‌రోనా వైర‌స్ మాటువేసి మ‌రీ కాటు వేస్తోంది. ర‌క‌రకాల వేరియంట్స్ ఇప్పుడు ద‌డ పుట్టిస్తున్నాయి. కొత్త ల‌క్ష‌ణాల‌తో విరుచుకుపడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సుందరసాల గ్రామంలో వీధి నాటకం కొంపముంచింది. గత 15 రోజుల క్రితం 5 రోజులపాటు గ్రామంలో చిడతల రామాయణం ప్రదర్శన జ‌రిగింది. ఈ ప్రదర్శనకారుల్లో ముగ్గురికి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రదర్శనకు హాజరై‌న 150 మందికి టెస్టులు చేశారు అధికారులు. ప‌రీక్ష‌ల్లో 100 మందికి వైర‌స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామస్తులు తీవ్ర‌ భయాందోళనలో ఉన్నారు. అధికారులు అన్ని కోవిడ్ నియ‌మాలు పాటించాల‌ని గ్రామ‌స్థుల‌ను కోరుతున్నారు.

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం..

తెలంగాణలో కరోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొత్త‌గా 1,03,770 టెస్టులు చేయ‌గా.. కొత్తగా 7,432 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో శుక్ర‌వారం కరోనాతో 33 మంది మరణించారు. కరోనా బారి నుంచి కొత్త‌గా 2,152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,464 కేసులు వెలుగుచూశాయి.

Also Read:  ఇంట్లో అద్దెకు దిగి.. ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులమంటూ.!

 మే 15 నాటికి భారత్‌లో మ‌రింత ఉధృతంగా మార‌నున్న క‌రోనా.. మ‌రి త‌గ్గేది ఎప్పుడు..?