Corona Cases: మే 15 నాటికి భారత్‌లో మరింత ఉధృతంగా మారనున్న కరోనా.. మరి తగ్గేది ఎప్పుడు..?
Corona Cases: "కరోనా మహమ్మారి తోక ముడుచుకొని పారిపోతోంది.. వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదని" అంతా ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో రెండో వేవ్ రెట్టింపు...
Corona Cases: “కరోనా మహమ్మారి తోక ముడుచుకొని పారిపోతోంది.. వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదని” అంతా ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో రెండో వేవ్ రెట్టింపు వేగంతో దూసుకొచ్చింది. గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ రోజుకు ఏకంగా మూడున్నర లక్షలు కేసులు నమోదవుతూ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక మరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిచోట్ల స్మశానాలు కూడా సరిపోవట్లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా కరాళ నృత్యమే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25.5 లక్షలు దాటి పోయింది. మరి కరోనా ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండనుంది.? కేసులు ఇలాగే పెరుగుతాయా.? తగ్గుముఖం పడేదెప్పుడు లాంటి అంశాలపై ఐఐటీ కాన్‌పూర్ శాస్ర్తవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్యను ఆధారం చేసుకొని కొన్ని విషయాలను వివరించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మే 11 నుంచి 15 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 33 నుంచి 35 లక్షలకు చేరువతుందని తెలిపారు. ఇలా గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత వెంటనే కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలో కొత్త కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ఐఐటీ కాన్‌పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ మనింద్రా అగర్వాల్ మాట్లాడుతూ.. “మే రెండో వారంలో గరిష్టంగా పెరిగిన కేసులు నెల చివరి నాటికి ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పడతాయని” చెప్పుకొచ్చారు.
Also Read: India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,624 మంది మృతి.. కేసులు..
Covid-19: కరోనా కాటు.. ఒకేరోజు అన్నదమ్ములను పొట్టనబెట్టుకున్న మహమ్మారి.. తండాలో విషాదం..