Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ స్ట్రెయిన్లు ప్రమాదకరమంటున్న నిపుణులు

ఇప్పుడూ కేసులు పెరగడానికి కారణం కొత్తగా వచ్చిన మ్యూటెంట్లు..దేశంలో కోవిడ్ రోజురోజుకూకొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

Corona Virus: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ స్ట్రెయిన్లు ప్రమాదకరమంటున్న నిపుణులు
Corona
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 24, 2021 | 8:28 AM

Coronavirus New Variant: ట్రేస్…ట్రాక్..ట్రీట్ అన్నది కరోనా ఫస్ట్ ఫేస్‌లో విపరీతంగా వినిపించిన మాట. ఒక్క కేసు వస్తే చాలు, ఆ కేసు గత వారం రోజులుగా ఎవరెవరితో కాంట్రాక్టు అయ్యారు అన్నది ట్రాక్ చేసి, వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించి అబ్జర్వేషన్ లో వుంచేవారు. ఇప్పుడు అలా ట్రాక్, ట్రేస్ చేయకపోవడంతో కరోనా పేషెంట్లు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. మరి కేసులు పెరగకుండా ఎలా వుంటాయి?

ఇప్పుడూ కేసులు పెరగడానికి కారణం కొత్తగా వచ్చిన మ్యూటెంట్లు..దేశంలో కోవిడ్ రోజురోజుకూకొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ఉత్పరివర్తనాలు వల్లనే వ్యాప్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే డబల్ మ్యూటెంట్ వైరస్ వ్యాప్తి తో కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. కొత్తగా ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి రావడం శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేకమైన జన్యువుతో, రోగనిరోధకశక్తిని దాటుకుని చొచ్చుకుపోయే కొత్త ఉత్పరివర్తనలు ప్రవర్తనతో b1.618గా రకం వైరస్ పశ్చిమబెంగాల్లో వ్యాప్తిలో ఉందని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్‌గా చెప్పుకునే డబుల్ న్యూటన్ బి.1.167 రకం ఎక్కువ శాతం ఉంది… వ్యాధికారక కీలక స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ 484 క్యూ, ఎల్452ఆర్ రెండు ఉత్పరివర్తనాలతో కలిసి ఏర్పడడంతో డబులు మ్యుటెంట్ అంటున్నారు. ఈ 484 క్యూ మ్యుటేషన్ యూకే, దక్షిణాఫ్రికా నుంచి, ఎల్452ఆర్ మ్యుటేషన్ కాలిఫోర్నియా నుంచి వ్యాపించాయి.

ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌తో భయపెడుతున్న కరోనా వైరస్ ఇంకోసారి ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్ మ్యూటెంట్‌గా మరింత బలంగా తయారైంది. ప్రత్యేక జన్యువుతో రోగ నిరోధకశక్తిని దాటుకుని మరీ చొచ్చుకుపోయే కొత్త రకం మ్యూటెంట్ బి.1.618ను పశ్చిమ బెంగాల్‌లో గుర్తించినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు..దేశంలో ఇటీవల గుర్తించిన డబుల్‌, ట్రిపుల్‌ మ్యూటెంట్‌ స్ట్రెయిన్ల మధ్య పెద్దగా తేడా ఏమీలేదని, రెండు స్ట్రెయిన్లు ఒకే మాదిరిగా ఉన్నాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ డైరెక్టర్‌ సౌమిత్రా దాస్‌ అన్నారు. ఈ స్ట్రెయిన్లు బీ.1.617 వైరస్‌ రకానికి చెందినవని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ స్ట్రెయిన్లపై ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.

ఒకపక్కా రోజుకు మూడులక్షల కేసుల వస్తున్నాయి. రోజుకు రెండు లక్షల మందికి నయం అయిపోయినా, లక్ష మంది వెనక్కు వుంటున్నారు. ఇలా చూస్తుంటే కొన్నాళ్లకు కొన్ని లక్షల మంది రోగులు ఈ దేశంలో కరోనాతో బాధపడుతున్నవారు వుండిపోతారు. వీరందరూ నయమై, దేశం కరోనా ఫ్రీ కావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? మరి ఈ లెక్కలు ప్రభుత్వం వేస్తున్నాయా?..మొత్తం మీద కరోనా మలి దశ లేదా సెకెండ్ వేరియెంట్ నేపథ్యంలో తలెత్తుతున్న అనుమానాలు, భయాలుగా మారుతున్నాయి. భయాలుగా మారితే ఫరవాలేదు. కానీ పరిస్థితి భయానకంగా మారిపోకూడదు.

Read Also..  Covid-19: కరోనా కాటు.. ఒకేరోజు అన్నదమ్ములను పొట్టనబెట్టుకున్న మహమ్మారి.. తండాలో విషాదం..