ఇంట్లో అద్దెకు దిగి.. ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులమంటూ.!

దొంగలు రూటు మార్చారు. ఏకంగా పోలీసుల పేరు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా....

ఇంట్లో అద్దెకు దిగి.. ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులమంటూ.!
Image
Follow us

|

Updated on: Apr 24, 2021 | 1:20 PM

దొంగలు రూటు మార్చారు. ఏకంగా పోలీసుల పేరు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా యర్నగూడెంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిని అద్దె ఇంటి పేరుతో నిలువు దోపిడీ చేశారు. నాగేశ్వరరావుకు సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో పక్క పోర్షన్‌ ఖాళీగా ఉండటంతో టులెట్‌ బోర్డు పెట్టాడు. ఫ్యామిలీస్‌కు మాత్రమే ఇల్లు అద్దెకు ఇస్తామని బోర్డులో స్పష్టంగా తెలిపారు.

అయితే, ఆ బోర్డు చూసిన ఓ వ్యక్తి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి తాను పోలీస్‌నని, ఫ్యామిలీతో పాటు ఉండేందుకు ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి పోలీస్‌ అని నమ్మిన నాగేశ్వరరావు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించాడు. మరుసటి రోజు ఓ మహిళను తీసుకొచ్చి తన భార్యగా నాగేశ్వరరావుకు పరిచయం చేశాడు. రెండు రోజులు ఇంట్లో ఉండి, ఆ తర్వాత బ్యాగ్‌తో వెళ్లిపోయారు. మరుసటి రోజు ఒక్కడే రావడంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు అతని ఆధార్‌కార్డ్‌ అడిగాడు. అయితే ఇప్పుడు తన దగ్గర లేదని, రెండు రోజుల తర్వాత తెచ్చి ఇస్తానని చెప్పాడు.

మరో రోజు సాయంత్రం 6 గంటలకు ఓ వ్యక్తి వచ్చాడు. రాత్రి 7.30కి తిరిగి వెళ్లాడు. వెళ్లే సమయంలో ఇద్దరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి. అయితే అద్దెకు ఇల్లు తీసుకున్నారు కనుక సామాన్లు కావొచ్చని నాగేశ్వరరావు భావించారు. నాగేశ్వరరావుకు బట్టల దుకాణం ఉండటంతో రాత్రి 9.30 వరకు కుటుంబసభ్యులు ఇంటికిరారు. అయితే రాత్రి 9.30కి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, 20 వేల నగదు మాయమయ్యాయి. దీంతో పోలీస్‌ యూనిఫామ్‌లో ఇంట్లో అద్దెకు దిగిన వారి పనేనని భావించి నాగేశ్వరరావు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి