AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఐటీ సోదాలు.. భయపడేదే లేదంటున్న బీఆర్ఎస్

తెలంగాణలో ఐటీ సోదాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకేరోజు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టార్గెట్‌ చేయడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టించింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి.. ఈ ముగ్గురి ఇళ్లు, కంపెనీల్లో గంటల తరబడి ఐటీశాఖ సోదాలు చేసింది .

తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఐటీ సోదాలు.. భయపడేదే లేదంటున్న బీఆర్ఎస్
It Raids
Aravind B
|

Updated on: Jun 15, 2023 | 6:59 AM

Share

తెలంగాణలో ఐటీ సోదాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకేరోజు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టార్గెట్‌ చేయడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టించింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి.. ఈ ముగ్గురి ఇళ్లు, కంపెనీల్లో గంటల తరబడి ఐటీశాఖ సోదాలు చేసింది . ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించింది. మొత్తం 60 ప్రాంతాల్లో ఒకేసారి ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. కొత్త ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి.. ఈ ముగ్గురి ఇళ్లు, కంపెనీల్లోనే ఎందుకు సోదాలు జరిగాయి ?ఏమైనా లింకులు ఉన్నాయా? అంటే ఉన్నట్లే తేలింది. ఈ ముగ్గురి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోన్న మెయిన్‌ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌లో పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉంటే, ఇదే కంపెనీలో కొత్త ప్రభాకర్‌రెడ్డి భార్య మంజులత మరో డైరెక్టర్‌గా ఉన్నారు . ఈ కంపెనీ పెద్దఎత్తున పన్నులు ఎగ్గొట్టిందన్న సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగాయి.

అయితే పైళ్ల శేఖర్‌రెడ్డి కంటే ముందు ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. భువనగిరి తహశీల్దార్‌గా ఏడేళ్లు పనిచేసిన మోహన్‌రెడ్డి… ఇటీవలే రిటైర్ అయ్యారు. మోహన్‌రెడ్డి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్‌ ఆధారంగానే MLA పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. మరోవైపు ఇది ముమ్మాటికీ రాజకీయ వేధింపులే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేంద్రం, బీజేపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఇంకెన్ని సోదాలు చేసిన భయపడేదేలే లెదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్