Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: నేడు అమెరికా పయనమవుతోన్న కేటీఆర్‌.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి టూర్‌.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా ఈరోజు నుంచి రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. టూర్‌లో భాగంగా మంత్రి అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం...

KTR: నేడు అమెరికా పయనమవుతోన్న కేటీఆర్‌.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి టూర్‌.
KTR America Tour
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2023 | 8:45 AM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా ఈరోజు నుంచి రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. టూర్‌లో భాగంగా మంత్రి అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను మంత్రి వారికి వివరించనున్నారు. కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు పలువురు అధికారులు కూడా అమెరికా వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల లండన్‌ టూర్‌ వెళ్లిన మంత్రి కేటీఆర్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు బ్రిటన్‌కు చెందిన ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ తాజా అమెరికా టూర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను అమెరికన్‌ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా తెలంగాణలో పెట్టుబడులపై కొన్ని కీలక ఒప్పందాలు జరగనున్నట్లు పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..