AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు.. చెప్పుల దండతో యువకుడు.. అసలు విషయం ఆరా తీస్తే..

ఐపీఎల్ హడావిడి తెలుగు రాష్ట్రాల్లో పీక్ లెవల్‌కి చేరింది. ఇప్పటికే పలువురు బెట్టింగ్స్ వేసి నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వింత సవాళ్ల వార్ నడుస్తోంది. తమకు ఇష్టమైన జట్టు ఓడిపోతే.. లేకపోతే పలానా జట్టు గెలిస్తే.. తింగరి పనులు చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Telangana: తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు.. చెప్పుల దండతో యువకుడు.. అసలు విషయం ఆరా తీస్తే..
IPL Fan Challenge
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 05, 2025 | 2:55 PM

Share

IPL ఫీవర్ మన దేశంలో పతాక స్థాయికి వెళ్లింది. బెట్టింగ్, ఫ్యాన్ వార్స్ హంగామా ఈ 2 నెలల పాటు చూసాం. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ట్రాజెడీలో 11 మంది దుర్మరణం చెందారు. కాగా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్ పట్ల తన ఇష్టాన్ని వినూత్నంగా ప్రదర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చలు, ఫ్యాన్ వార్‌లు కొనసాగడం సాధారణమే. కానీ ఈ యువకుడు మాత్రం తన అభిమాన టీమ్ గెలిచిన సందర్భంలో ఏకంగా తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు కొట్టుకొని.. మెడలో చెప్పుల దండ వేసుకొని తిరగడానికి సవాల్ స్వీకరించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్ గెలిస్తే తాను తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు కొట్టుకొని.. మెడలో చెప్పుల దండ వేసుకొని తిరుగుతానని ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించడంతో పలువురు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కామెంట్స్ పెట్టారు.

తొలుత సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ vs పంజాబ్ టీమ్‌ల మధ్య జరిగింది. పంజాబ్ గెలిస్తే తాను తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పి తిరుగుతానని ఛాలెంజ్ విసిరాడు. పంజాబ్ టీమ్ గెలిచిన వెంటనే.. ఆ యువకుడు గర్వంగా చౌరస్తాలో షర్ట్ విప్పి తిరుగుతూ ఓ వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇక ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ vs ఆర్సీబీ బరిలో ఉండగా ఆర్సీబీ గెలిస్తే తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు కొట్టుకొని.. మెడలో చెప్పుల దండ వేసుకొని తిరుగుతానని చేసిన అతని ఛాలెంజ్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ స్పందించారు. ఆర్సీబీ గెలుస్తే, ఛాలెంజ్ స్వీకరించేందుకు ఉండు అంటూ పలువురు కామెంట్స్ చేశారు.

చివరికి RCB గెలవడంతో ఆ యువకుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. తాండూరు బస్‌ స్టాండ్‌లో అరగుండు కొట్టుకొని.. మెడలో చెప్పుల దండ వేసుకొని తిరుగుతూ ఓ వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తరహా ఘటనలు మున్ముందు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి