SSC Selection Post Notification 2025: నిరుద్యోగులకు భలే ఛాన్స్.. టెన్త్, ఇంటర్ అర్హతతో భారీగా కేంద్ర కొలువులు!
SSC Selection Post Phase 13 Notification 2025: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద..

న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,423 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు జూన్ 23, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధాంగా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎమ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ ఆధారంగా జూన్ 23, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 2, 2025.
- దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 23, 2025 .
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూన్ 24, 2025.
- దరఖాస్తు సవరణ తేదీలు: జూన్ 28 నుంచి 30 వరకు
- రాత పరీక్ష తేదీలు: జులై 24 నుంచి ఆగస్టు 4 వరకు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ సీ, డీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




