TG TET Exam 2025 Schedule: టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. హాల్ టికెట్లు ఎప్పట్నుంచంటే?
TS TET 2025 exam schedule: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) జూన్ సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 15వ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్న విద్యాశాఖ..

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) జూన్ సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 15వ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్న విద్యాశాఖ.. తాజాగా జారీ చేసిన షెడ్యూల్‌లో మాత్రం జూన్ 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతాయని పేర్కొంది.
జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 23న మధ్యాహ్నం, 28న ఉదయం విడతల్లో మాత్రమే పరీక్షలు ఉంటాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు 16 విడతల్లో ఈ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు పేపర్ వారీగా పూర్తి షెడ్యూల్‌ను టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి విడుదల చేశారు. కాగా ఈ ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది తొలి విడత పరీక్షలు ఏడాది ప్రారంభంలో నిర్వహిచంగా.. రెండో విడత జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
జూన్ సెషన్ టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. వీరందరికీ జూన్ 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని, తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. టెట్ పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9గంటల నుంచి 11.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆయా తేదీల్లో జరుగుతాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




