IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం.. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో విస్తృత తనిఖీలు..
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో గురువారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై విస్తృత దాడులు చేశారు
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో గురువారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై విస్తృత దాడులు చేశారు. తెలుగు రాష్ట్రాలలో మొత్తం 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, తాడిపత్రి, బెంగళూరు, బళ్లారిలో ఏక కాలంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. కాగా బుధవారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నవ్య కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో పలు చోట్ల నవ్య సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, పటాన్‌చెరులోని సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా బల్కంపేటలోని స్కందాన్షీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, రాగ మయూరి రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, ఆ సంస్ధల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక సోదాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ సంస్థలు ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజుల్లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం. Also Read:
DJ Tillu: టిల్లు అన్న డీజే పెడితే ఇలాగే ఉంటది.. అదరగొడుతోన్న డీజే టిల్లు టైటిల్ సాంగ్..