Work from Home: ఇక ఇంటి నుంచే పని.. ఒమిక్రాన్‌ ముప్పుతో పూర్తిస్థాయిలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’!

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. దీంతో.. పలు ప్రముఖ ఐటీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం

Work from Home: ఇక ఇంటి నుంచే పని.. ఒమిక్రాన్‌ ముప్పుతో పూర్తిస్థాయిలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’!
Work From Home
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2022 | 6:01 PM

Work from Home due to Corona Cases: మరోసారి ప్రపంచవ్యాప్తం కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇటు భారత్‌లోనూ మరోసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90 వేలకు పైగా కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. దీంతో.. పలు ప్రముఖ ఐటీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నార పాటు ఐటీ ఉద్యో గులు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టటంతో తిరిగి క్రమేణా కార్యాలయాలు తెరుచుకున్నాయి.

మరోవైపు, ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తి స్థాయిలో ‘ఇంటి నుంచి పని’ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పద్ధతికి మారిపోతున్నారు. కొవిడ్‌ రెండో దశ కేసులు తగ్గాక, కార్యాలయాలకు కొద్దిమంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు. కొవిడ్‌ ‘ఒమిక్రాన్‌’ ముప్పు పెరుగుతున్నందున వీరినీ ఇంటి నుంచే పనిచేయాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు స్థానిక ఐటీ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ‘ఒమిక్రాన్‌’ ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐటీ కంపెనీలు దృష్టి సారించాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున, కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో గత కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల్లో 15- 20 శాతం మంది కార్యాలయాలకు వచ్చి పనిచేయటం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఈ సంఖ్య పెరుగుతుందని, త్వరలో పూర్తిస్థాయిలో ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావించారు. కానీ, అనూహ్యంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతుండటం, వీటికి తోడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో మరోసారి ఆందోళన నెలకొంది. ఐటీనే కాకుండా దేశంలోని ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పలు వ్యాపార సంస్థలు కూడా తాజా పరిణామాల దృష్ట్యా తమకు అనువైన చర్యలను తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కూడా కరోనా భయంతో ఆఫీసులకు రావడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్క్ ఫ్రం హోం అమల్లోకి తీసుకువస్తున్నట్లు కొన్ని దిగ్గజ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

అయితే, కేసులు తగ్గుముఖం పడితే తిరిగి ఉద్యోగులు కార్యాలయాలకు రాక మొదలవుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా తమ కంపెనీ పని తీరు లో నెగటివ్ ప్రభావం లేదని విశ్లేషిస్తున్నారు. దీంతో..ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని తిరిగి వర్క్ ఫ్రం హోం అమలుకు ఐటీ పరిశ్రమ నిర్ణయించింది.

Read Also… Crime News: నిశ్చితార్థం జరిగిన బాలికపై లైంగిక దాడి, ఆపై రాళ్లతో కొట్టి దారుణ హత్య!