AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 50 ఏళ్లుగా సెలూన్‌ ముఖం చూడలేదు.. కారణం ఏంటో తెలుసా.?

సాధారణంగా మనం ఎన్ని రోజులకు ఒకసారి సెలూన్‌ వెళ్తుంటాం. ఒక నెల రోజులు, మహా అయితా రెండు నెలలు అంటారా.? అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 50 ఏళ్ల నుంచి కటింగ్ షాప్‌ వైపు చూడడం లేదు. అలాగని అతడు గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకోవడానికో మరో కారణానికో ఆ పని చేయడం లేదు. ఇంతకీ అతను ఎవరు.? జుట్టు కత్తిరించుకోకపోవడానికి కారణం ఏంటో తెలియాలంటే...

Telangana: 50 ఏళ్లుగా సెలూన్‌ ముఖం చూడలేదు.. కారణం ఏంటో తెలుసా.?
Naga Bhushanam
N Narayana Rao
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 12, 2024 | 3:45 PM

Share

సాధారణంగా మనం ఎన్ని రోజులకు ఒకసారి సెలూన్‌ వెళ్తుంటాం. ఒక నెల రోజులు, మహా అయితా రెండు నెలలు అంటారా.? అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 50 ఏళ్ల నుంచి కటింగ్ షాప్‌ వైపు చూడడం లేదు. అలాగని అతడు గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకోవడానికో మరో కారణానికో ఆ పని చేయడం లేదు. ఇంతకీ అతను ఎవరు.? జుట్టు కత్తిరించుకోకపోవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నివాసముంటున్న ఇనపనూరి నాగభూషణం అనే 80 సంవత్సరాల వయసున్న వ్యక్తి 49 ఏళ్లుగా జుట్టును కత్తిరించుకోకుండా పెంచుతున్నాడు. నాగభూషణం 31వ ఏటా తనకు పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించేందుకు అప్పటినుంచి దాదాపుగా 49 ఏళ్లుగా జుట్టును కత్తిరించుకోకుండా పెంచుతున్నాడని చెబుతున్నాడు. దీంతో 50 ఏళ్లుగా జుట్టు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగభూషణం జుట్టు సుమారు 12 అడుగుల మేర భారీగా పెరిగింది.

నాగభూషణం దమ్మపేట మండలంలోని గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ పూజారిగా గతంలో పని చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామికి సమర్పించేందుకు 50 ఏళ్ల పాటు జుట్టు పెంచుతానని మొక్కున్నానని చెప్పుకొచ్చారు. ఇలా 49 ఏళ్లుగా జుట్టు పెంచుతున్నానని, ఇప్పుడు సుమారు 12 అడుగుల పొడవు జుట్టు పెరగగా దారంతో పాయలుగా చుట్టి భుజాన వేసుకుంటున్నట్లు తెలిపారు. తన గురువుల సూచన మేరకు లోక కళ్యానర్థం 49 ఏళ్లగా జుట్టును కత్తిరించుకోకుండా పెంచుతున్నానని మరో ఏడాది పెంచితే 50 ఏళ్లు పూర్తవుతుందని నాగభూషణం వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..