Hyderabad: పడకేసిన పట్నం.. వణికిపోతున్న పల్లె.. సీజ‌న‌ల్ వ్యాధుల విజృంభణ

ఈసారి డెంగీ దండెత్తుతోంది. రాష్ట్రంలో చాలా ఆస్పత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే రోగులే కనబడుతున్నారు. ఇక హైద‌ర‌బాద్‌లో కూడ వీటి ప్ర‌భావం అధికంగానే ఉంది. పది రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో అపరిశుభ్ర వాతావరణం నెల‌కొన‌డంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ...

Hyderabad: పడకేసిన పట్నం.. వణికిపోతున్న పల్లె.. సీజ‌న‌ల్ వ్యాధుల విజృంభణ
Representative Image
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jul 12, 2024 | 4:11 PM

వర్షాకాలం మొదలైంది అంటే సీజనల్ వ్యాధులకి వెల్కమ్ చెప్తూ ఉంటాయి.. ప్రతి ఇంట్లో జ్వరము దగ్గు జలుబు వంటి వైరల్ జ్వరాలతో జనాలను ప‌ట్టి పీడిస్తుంటాయి. ఇప్పటికే వ్యాధుల భారిన పడిన వారు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఏ హ‌స్పిట‌ల్‌లో తొంగి చూసిన రోగుల క్యూ లైన్ కనిపిస్తుంది.

ఈసారి డెంగీ దండెత్తుతోంది. రాష్ట్రంలో చాలా ఆస్పత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే రోగులే కనబడుతున్నారు. ఇక హైద‌ర‌బాద్‌లో కూడా వీటి ప్ర‌భావం అధికంగానే ఉంది. పది రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో అపరిశుభ్ర వాతావరణం నెల‌కొన‌డంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు కాస్త తక్కువ ఉన్నాయని వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2023 జూన్ మాసంలో 284 కేసులు నమోదు కాగా… 2024 జూన్ లో 263 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. హైద్రాబాదు నగర శివారులో చేవెళ్ల మండలం చన్వెల్లిలో డెంగ్యూ సోకి ఒక బాలుడు మృతి చెందగా.. మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో క్యూ లైన్లు చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక డెంగీ రోగిని కుట్టిన దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతడికి డెంగీ వచ్చే ప్రమాదముంది. ఈ దోమకు మనిషి రక్తమే ఆహారం.

డెంగీ దోమ పగటి పూట మాత్రమే కుడుతుంది. డెంగీ వచ్చిన రోగిలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోతుంది. విష జ్వరం తీవ్రంగా మారి ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక బయటకు వెళ్లేటప్పుడు ఫుల్‌ సైజ్‌ దుస్తులు వేసుకోవాలి. అయితే ప్రైవేట్ ఆస్పత్రులలో ప్లేట్లెట్లు తగ్గాయని లక్షలకు లక్షలు వసూలు చేస్తూ ప్లేట్ లెట్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా 20 వేలకు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించుకునే అవసరం ఉంటుంది. లేకపోతే డెంగీ జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగే స్వభావం ఉంటుంది.

వర్షాకాలంలో ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయాలి లేకపోతే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించకపోతే దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడతారు. అందుకే ఇంటిపై ఉండే ట్యాంకులకు మూతలు పెట్టాలి. ఫ్లవర్‌ వాజ్‌, కూలర్‌ నీళ్ళను నిత్యం మార్చాలి. కాలనీ, ఇళ్లలో నిల్వ ఉండే గుంతులను పూడ్చాలని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. మరోవైపు ఎటువంటి వ్యాధులకైన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసి సీజనల్ వ్యాధులని అరికట్టేందుకు సన్నద్దం అయిందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్