AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: జాగ్రత్త సుమా!.. సోషల్ మీడియాలో ఆ పని చేశారో ఇక అంతే సంగతులు..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులే ప్రజల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై సోషల్ మీడియా యాక్షన్ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్షన్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ప్రశాంతతకు భంగం కలిగించేలా ఏవైన పోస్టులు వస్తే వాటిని గుర్తించి తొలగించడంతో సహా పోస్టు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

Social Media: జాగ్రత్త సుమా!.. సోషల్ మీడియాలో ఆ పని చేశారో ఇక అంతే సంగతులు..
Social Media
Aravind B
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 11, 2023 | 4:46 PM

Share

గణేష్ నవరాత్రోత్సవాలు, అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్ మీడియాపై నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులే ప్రజల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై సోషల్ మీడియా యాక్షన్ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్షన్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ప్రశాంతతకు భంగం కలిగించేలా ఏవైన పోస్టులు వస్తే వాటిని గుర్తించి తొలగించడంతో సహా పోస్టు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక గణేష్ నవరాత్రులు, నిమజ్జనోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు ఏకంగా 20 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ.. ప్రజల్లో గొడవలకి దారితీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పోలీసులు సోషల్ మీడియాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ.. ఈ రెండు వేడుకలు కూడా ఒకే రోజు వస్తున్నాయి. ఆ సమయంలో అప్రపత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. అందుకే సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు ఈ పండుగల వేళ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా అభ్యంతర పోస్టులు ప్రజల మధ్య వివాదాలు కలిగించేలా ఉంటే కేసులు పెడుతూ ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని.. ఏదైనా అనుమానాలు ఉంటే పోలీసులతో నిర్ధారణ చేసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికే పీఎస్ కమిటీలు, ఉత్సవ కమిటీలు, మండపాల కమిటీలో ఆయా స్థాయిలో పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనం పూర్తి కాగానే.. ఎన్నికల బందోబస్తుపై పోలీసులు దృష్టిసారించనున్నారు. ఒ పక్క గణేష్ పండుగ బందోబస్తుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే వచ్చే ఎన్నికల్లో కూడా బందోబస్తుకు ఇప్పుటినుంచే సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలో సోషల్‌ మీడియా కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు, దూషణలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇటువంటి వాటికి చోటు లేకుండా, శాంతిభద్రతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సోషల్ మీడియాపై నిఘాను పటిష్టం చేస్తున్నారు పోలీసులు. ఎవరైనా చట్టాన్ని దిక్కరిస్తే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని హచ్చరికలు చేస్తున్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..