Hyderabad: బాస్ వైఫ్‌తో అక్రమ సంబంధం.. ఆ ఇంట్లోనే విగతజీవిగా మారిన వైనం..

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సమస్యల్ని ఎదురుకొనే మనస్తత్వం మనిషిలో తగ్గిపోతుంది.

Hyderabad: బాస్ వైఫ్‌తో అక్రమ సంబంధం.. ఆ ఇంట్లోనే విగతజీవిగా మారిన వైనం..
Suspicious Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 26, 2021 | 4:15 PM

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సమస్యల్ని ఎదురుకొనే మనస్తత్వం మనిషిలో తగ్గిపోతుంది. చిన్న పొరపాట్లకే తమకు తాము పెద్ద శిక్షలు విధించుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వైఫల్యాలు, అక్రమ సంబంధాలు ఇలాంటి విషయాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. తాజాగా బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనే జరిగింది.

బల్కంపేట్‌కి చెందిన దుర్గేష్ ఏసీ టెక్నీషియన్. ఇతడు ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి వద్ద సహాయకుడుగా పని చేస్తున్నాడు. దుర్గేష్ అవివాహితుడు కాగా ప్రేమ్ సింగ్‌కి ఆల్రెడీ పెళ్లయింది. అయితే వృత్తిరీత్యా దుర్గేష్, ప్రేమ్ సింగ్ రోజు కలుసుకునేవారు. పని మీద అప్పుడప్పుడు ప్రేమ్ సింగ్ ఇంటికి దుర్గేష్ వెళ్ళేవాడు. ఇదే క్రమంలో ప్రేమ్ సింగ్ భార్యతో దుర్గేష్‌కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. ప్రేమ్ సింగ్ లేని సమయంలో దుర్గేష్ తరచూ అతడు ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో దుర్గేష్… ప్రేమ సింగ్ భార్య మైకంలో మునిగిపోయాడు. ఏమైందో ఏమో కానీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రేయసి నుంచి ఎడబాటు తట్టుకోలేని దుర్గేష్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 24న పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన దుర్గేష్… మళ్లీ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అయితే 25 సాయంత్రం దుర్గేష్ బావకి బోయిన్‌పల్లి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే దుర్గేష్ మీద ఇంకో కేస్ ఉండటంతో దాని నిమిత్తం అనుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. తీరా దుర్గేష్.. ప్రేమ్‌ సింగ్ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడని, డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయని, ఫోన్ కాల్ డేటా ఆధారంగా తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. కానీ దుర్గేష్ సోదరి అరుణ మాత్రం అతడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!