Telangana: 100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్
కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి వింటే షాకింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి వింటే షాకింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంది. తాజాగా తెలంగాణలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కారులో పాము దూరింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్నేక్ లోపల ఉందన్న విషయం తెలియదు. దాదాపు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. ఈ క్రమంలో కార్ ఇంజన్ వద్ద నుంచి ఏదో సైండ్స్ వచ్చాయి. ఏమైనా ట్రబుల్ ఏమో అని చూడగా.. లోపల పాము దర్శనమివ్వడంతో అందరూ కంగుతిన్నారు. గమ్య స్థానానికి చేరుకునే సమయానికి కారులో తమతో పాటు ఓ పాము కూడా ఉందనే విషయం తెలిసి అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. లోపల దాక్కున్న పామును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడి.. చివరికి అతి కష్టం మీద వెలికి తీశారు.
వివరాల్లోకి వెళ్తే.. కారులో ప్రయాణించి తమ పని ముగించుకుని తిరిగి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చే సమయంలో తమతో పాటు పాము కుడా ఉందనే విషయాన్ని అందులో ప్రయాణిస్తున్నవారు గమనించారు. వెంటనే మావల వద్ద బండిని ఆపి.. దాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. విషయం తెలుసుకుని స్థానికులు సైతం అక్కడ గుమిగూడి పామును వెలికితీసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి కార్ లోపల దాక్కున్న పామును చాకచక్యంగా బయటకు తీసి సురక్షిత ప్రాంతంలో దానిని వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్
సీటు దొరకలేదు.. క్రేజీ ఐడియాతో ట్రైన్‌లో ఉన్నవాళ్లకి మెంటలెక్కించాడు