Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభం
Telangana Skill University
Follow us
Sravan Kumar B

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2024 | 5:00 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుండి ప్రాధమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంతవరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు గానూ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్‌లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ చైర్-పర్సన్‌గా ఆనంద్ మహేంద్రను, శ్రీనివాస సి రాజును కో-చైర్మన్‌గా నియమించడం జరిగిందన్నారు.

ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్‌లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన SBI, NAC, Dr. Reddy, TVAGA , ADANIలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించారని.. వీరితోపాటు CII కూడా ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈ యూనివర్సిటీ కి సంబందించిన లోగోను, Websiteను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!