Hyderabad: లక్షకు నాలుగు లక్షలంటూ వసూలు చేసిన కంపెనీ.. చివరకు అసలు విషయం తెలిసి..
కంటికి అంతా వర్చువల్..! బ్యాంకుల నియంత్రణ లేదు. అయినా అత్యాశతో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టి దివాళా తీస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు.. వందల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు.
కంటికి అంతా వర్చువల్..! బ్యాంకుల నియంత్రణ లేదు. అయినా అత్యాశతో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టి దివాళా తీస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు.. వందల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు. లెటేస్ట్‌గా హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. క్రిప్టో కరెన్సీ పేరుతో XCSPL కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో మూడు నెలల్లో 4లక్షల లాభం అంటూ కంపెనీ ఇన్వెస్టర్లకు ఆశ చూపింది. నాలుగు రెట్లు లాభం ఆశచూపి ఒక్కొక్కరి నుంచి పదిలక్షలు వసూళ్లు చేశారు కేటుగాళ్లు. చివరకు అప్పు చేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డులు వాడి బాధితులు ఇన్వెస్ట్ చేశారు. అయితే రోజులు గడుస్తున్నా స్పందించని XCSPL ఆఫీస్ నిర్వాహకుల నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు ఆ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. కూకట్‌పల్లి XCSPL కంపెనీలో సుమారు 20 మందికిపైగా బాధితులు ఒక్కొక్కరు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరు సొంతంగా పెట్టుబడులు..మరికొందరు బంధువులతో పెట్టుబడులు పెట్టించారు. అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ తప్ప మరే అగ్రిమెంట్ లేదని బాధితులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే , కంపెనీ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కూకట్‌పల్లి XCSPL కంపెనీలో బిట్స్‌కాయిన్ మాదిరిగానే కొత్తగా ఎక్స్‌కాయిన్ అనే డూప్లికాయిన్‌ను సృష్టించి ఇన్వెస్టర్లకు వల వేశారు కేటుగాళ్లు. దీని ద్వారా పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ , ఐటీ, ట్రావెల్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని దాదాపు 20 కోట్ల వరకూ వసూలు చేశారు. ఇక గోఫ్లై ఎక్స్ అనే విమాన టిక్కెట్ బుక్ చేసే వెబ్‌సైట్ ఒకటి తయారు చేసి, దాన్ని ద్వారా కోట్లలో ఆదాయం వస్తుందని నమ్మించారు. బెంగళూరులో లేని ఆఫీసును ఉన్నట్లుగా చూపించి, హైదరాబాద్‌లో వ్యాపారాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో బిట్‌కాయిన్, ఇతర ఆన్‌లైన్ దందాలో లాభాలు ఆర్జించివారిని చూసి ఆశపడిన ఇన్వెస్టర్లు, వీరి ట్రాప్‌లో పడి మోసపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..