Hyderabad: జనవరి 26 నుంచి హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్‌.. హెచ్చరించిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది భారత వాతవారణ శాఖ. ఈ మేరకు పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు..

Hyderabad: జనవరి 26 నుంచి హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్‌.. హెచ్చరించిన వాతావరణ శాఖ
Hyderabad
Follow us
Subhash Goud

|

Updated on: Jan 24, 2023 | 8:15 PM

హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది భారత వాతవారణ శాఖ. ఈ మేరకు పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఇక హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్‌లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 11డిగ్రీల సెంట్రిగ్రేడ్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో భాగ్యనగరంలో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపింది. జనవరి 26 నుంచి ఉష్ణోగ్రత్తలు పడిపోయే ప్రమాదం ఉందని వివరించింది.

దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ పొగమంచు కారణంగా వాహనదారులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రోడ్లు సరిగ్గా కనిపించని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప ఉదయం సమయంలో బయటకు వెళ్లాలని, లేకుంటే ఇంట్లోనే ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి