Hyderabad: కూరగాయల ధరలు కుతకుత.. సామాన్యుడు విలవిల.. రూ. 500 తీసుకెళ్తే వచ్చేది.!

కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే అమాంతంగా పెరిగిపోయాయి ఉల్లి టమాటా ధరలు. హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి 40.. టమాటా 50 రూపాయల ధర పలుకుతోంది..

Hyderabad: కూరగాయల ధరలు కుతకుత.. సామాన్యుడు విలవిల.. రూ. 500 తీసుకెళ్తే వచ్చేది.!
Vegetable
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 11, 2024 | 2:00 PM

కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే అమాంతంగా పెరిగిపోయాయి ఉల్లి టమాటా ధరలు. హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి 40.. టమాటా 50 రూపాయల ధర పలుకుతోంది.. ఇక రిటైల్ మార్కెట్లో వాటి ధర ఇంకా పైపైకే..! హైదరాబాద్‌లోకి ఎర్రగడ్డ రైతుబజార్‌లో కిలో టమోటా రూ. 50 ఉండగా.. కిలో ఉల్లి రూ. 40గా ఉంది. ఇక బీన్స్ కిలో అయితే రూ. 90కి పెరిగింది. ఏ కూరగాయ అయినా రూ. 50 పైనే పలుకుతోంది. అటు కిలో మిర్చి రూ. 50, బెండకాయ రూ. 55గా పలుకుతోంది. దిగుబడి తక్కువగా ఉండటంతోనే ధరలు ఇలా పెరిగాయని రైతులు అంటున్నారు. అటు ఈ ధరలు చూసి.. జనాలు హడలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. కూరగాయల ధరలు పెరుగుదలపై ఎర్రగడ్డ రైతు బజార్ EO రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో.. ఆ వేరియేషన్స్ కూరగాయల ధరల్లో కనిపిస్తున్నాయన్నారు. ప్రతి కూరగాయలోనూ 10 రూపాయల వేరియేషన్ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దిగుమతి తక్కువగా ఉంది. సీజనల్ కూరగాయలు కాకపోవడంతో కూడా ధరలు అమాంతంగా పెరిగాయి. వివిధ జిల్లాలో రాష్ట్రాల నుంచి దిగుబడి తక్కువగా ఉండడంతో కూడా కూరగాయల ధరలు పెరుగుదలకు కారణం కావచ్చు. అటు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆ భారం కూడా కూరగాయల రేట్లపై పడింది. కాగా, ఈ పెరిగిన ధరలు దాదాపు నెలరోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందన్నారు ఈఓ రమేష్.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..