AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hitech Copy Attempt: వార్నీ.. ఏఐను ఇలా కూడా వాడేస్తున్నారా?.. తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే..

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డబడిన ఇద్దరు విద్యార్థుల వ్యవహారంలో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసేందుకు హర్యానకు చెందిన ఇద్దరు యువకులు ఏఐను ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు.

Hitech Copy Attempt: వార్నీ.. ఏఐను ఇలా కూడా వాడేస్తున్నారా?.. తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే..
Hyderabad Central University Ai Cheating Scandal
Anand T
|

Updated on: Dec 26, 2025 | 1:32 PM

Share

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డబడిన ఘటన గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. యూనివర్సిటీ అధికారుల సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సదురు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ను ఉపయోగించి పరీక్షలో కాపీ కొట్టినట్టు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్‌‌‌‌మెంట్‌ కోసం నియామక పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్ష రాసేందుకు హాజరైన ఇద్దరు అభ్యర్థులు అనిల్‌ కుమార్‌, సతీష్‌ పట్టుబడ్డారు ఎగ్జామ్‌లో కాపీ కొడుతూ పట్టుపడ్డారు. షర్ట్‌ బటన్లకు మైక్రో స్కానర్‌ను అమర్చి.. దాని సహాయంతో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌ను స్కాన్‌ చేశారు.

అనంతరం బాత్‌రూమ్‌ కోసమని వెళ్లి ఏఐ సహాయంతో సమాధానాలు సేకరించారు. వాటిని చెవిలో పెట్టుకున్న బ్లూటూత్‌ సహాయంతో విని రాయడం స్టార్ట్ చేశారు. అయితే వీరు తరచూ బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తూ పలు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు. కానీ చివరకు అతను పెట్టుకున్న బ్లూటూత్‌ నుంచి బీప్‌ శబ్ధం రావడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ తనిఖీ చేయగా అసలు విషయం బటయపడింది.

దీంతో ఇన్విజిలేటర్ వెంటనే వాళ్ల పేపర్ లాక్కొని.. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసింది. దీంతో అధికారులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు హర్యానాకు చెందిన ఇద్దరు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో