ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది
రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం మాజీ సైనికుడిని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు ఎక్కించే సెలైన్‌లో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడితో పాటు వైద్య సిబ్బంది సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

రోజు రోజుకు మానవ సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ముఖ్యంగా భార్యభర్తల సంబంధాలు కూడా చెడుతున్నాయి.. నేటికాలంలో వివాహేతర సంబంధాలు, అహంకారం, సరియైన విధంగా సమయం కేటాయించకపోవడం వంటి కారణాల వల్ల భార్యాభర్తల మధ్య బంధాలు మరింత బలహీనపడుతున్నాయి. నమ్మకం లోపించడం చిన్న సమస్యలను కూడా పెద్దవిగా మార్చుకోవడంతోపాటు భర్తను భార్య చంపడం లేదా.. భార్యను భర్త చంపడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. తాజాగా.. కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. భర్త, మాజీ సైనికుడు సందీప్‌ను హత్య చేసిన ఘటనలో.. అతని భార్య సుమ, ప్రియుడితోపాటు.. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు యమకనమరడి పోలీసులు తెలిపారు. సందీప్ కలగౌడ మంజరగి (46) ని హత్య చేయడం.. అలాగే, నకిలీ వైద్య పరీక్షలు, తప్పుగా నివేదిక ఇవ్వడం, నేరం నుంచి తప్పించుకునేందుకు పలు నేరాలు చేయడం.. అలాగే నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో మొత్తం 9 మందిని అరెస్టు చేశామని బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్ తెలిపారు.
వివరాల ప్రకారం.. సందీప్ మంజరగి సుమ దంపతులు.. సుమకు పుండలీక డొంబర్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.. భర్తపై రూ. 2కోట్ల ఇన్సూరెన్స్ ఉంది.. దీంతో సుమ డొంబర్ కలిసి అతన్ని హత్య చేయాలని ప్లాన్ రచించారు.. ఈ క్రమంలోనే.. సందీప్ మంజరగి మార్చి 13న రోడ్డు ప్రమాదంలో గాయపడి హుక్కేరిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.. దీంతో సుమ డోంబర్ కలిసి .. ప్లాన్ ను అమలు చేశారు. సందీప్ మంజరగికి ఎక్కించే సెలైన్ బాటిల్‌లో విషాన్ని ఎక్కించి.. సుమ, పుండలీక మార్చి 15న ఆయన్ను హత్య చేశారు.. అతను రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు చేశారు.. ఈ క్రమంలోనే సందీప్ సోదరుడికి అనుమానం రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.. మొదట సుమ, పుండలీకను అరెస్టు చేసి విచారించగా.. హత్యచేసినట్లు అంగీకరించారు. అంతేకాకుండా.. విచారణలో మరో ఏడుగురి పాత్ర తేలిందని.. దీంతో వారందరినీ అరెస్ట్ చేశామని గుళేద్ వివరించారు.
సుమ పుండలీక డొంబర్ తోపాటు.. ఈ కేసులో ఆర్‌ఎంపీ వైద్యుడు బసవరాజ భస్మె, బెళగావి కమిషనర్ కార్యాలయం ఎఫ్‌డీఏ అశోక గుజనాళ, ఫోరెన్సిక్ ప్రయోగశాల గుమస్తా అప్పాసాహెబ నాయక, ల్యాబ్ అసిస్టెంట్ అడవి స్వామిమఠ, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పీఎన్ నాగరాజ్, పుండలీక స్నేహితులు సేలార, రాహుల్ జోగిలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
