Lizards: ఇంట్లో ఈ 6 మొక్కలు ఉంటే బల్లులు తోక ముడుచుకుని పారిపోతాయి..
ఇళ్లలో గోడలకు అతుక్కుని తిరిగే బల్లులను తరిమికొట్టడం చాలా పెద్ద సవాలుతో కూడుకున్న పని. అయితే కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా వాటి ఘాటైన సువాసనలతో బల్లులను సహజంగానే దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుదీనా, నిమ్మగడ్డి, యూకలిప్టస్, బంతి మొక్క, వెల్లుల్లి , లావెండర్ వంటి మొక్కలు ఇళ్లకు సహజ రక్షణ కవచంలా పనిచేస్తూ బల్లుల బారి నుండి శాశ్వత విముక్తిని కలిగిస్తాయి.

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బల్లులు సాధారణంగా కనిపిస్తుంటాయి. బొద్దింకలు, చీమలు , ఇతర చిన్న కీటకాలను ఏదోక విధంగా సులభంగా చంపవచ్చు లేదా తరిమివేయవచ్చు కానీ, గోడలకు అతుక్కుని తిరిగే ఈ బల్లులను తరిమికొట్టడం మాత్రం చాలా కష్టమైన పని. అవి ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడ అకస్మాత్తుగా మాయమవుతాయో అర్థం చేసుకోవడం కష్టం. మీరు కూడా మీ ఇంట్లో బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వంటగదిలో దొరికే రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటానికి బదులుగా కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం ఉత్తమం. ఈ మొక్కలలో ఉండే ప్రత్యేక గుణాలు, వాటి నుండి వచ్చే ఘాటైన సువాసనలు బల్లులు మీ ఇంట్లోకి రాకుండా నివారిస్తాయి. బల్లులను సహజమైన పద్ధతిలో తరిమే ఆ 6 అద్భుతమైన మొక్కల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పుదీనా మొక్క
నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) మొక్క
యూకలిప్టస్ మొక్క
బంతి పూల మొక్కలు
వెల్లుల్లి మొక్క
లావెండర్ మొక్క
పెంపక విధానం
పుదీనాలో బల్లులను ఇంటికి దూరంగా ఉంచగల అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీని నుండి వచ్చే ఘాటైన వాసన చిన్న సరీసృపాలకు అస్సలు భరించరానిదిగా ఉంటుంది. ఇది బల్లులను మాత్రమే కాకుండా, అవి తినే చిన్న చిన్న కీటకాలను కూడా రాకుండా చేస్తుంది. నిమ్మగడ్డిలో సహజసిద్ధమైన సిట్రోనెల్లా నూనె గుణాలు ఉంటాయి. దీని బలమైన, తీపి-పుల్లని వాసన బల్లులను ఎఫెక్టివ్‌గా తరిమికొడుతుంది. దీనిని ఇంటి లోపల, బాల్కనీలో లేదా తోటలో నాటడం వల్ల బల్లులతో పాటు దోమల నివారణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. యూకలిప్టస్ మొక్కలో ఉండే నూనె గ్రంధుల వల్ల విపరీతమైన ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన బల్లుల ఇంద్రియాలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది, అందువల్ల ఇవి ఇంట్లోకి రావడానికి అస్సలు ధైర్యం చేయవు. దీనిని ఇంటి బయట కుండీలో, బాల్కనీలో లేదా కిటికీల దగ్గర పెంచడం మంచిది. బంతి మొక్కల్లో ఉండే బంతి పువ్వులలో పైరెత్రిన్స్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది ఇంటికి కీటకాలు , బల్లులు రాకుండా చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వంటగదిలో వాడే వెల్లుల్లిని బాల్కనీలో మొక్కగా నాటడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వల్ల వచ్చే ఘాటైన వాసన బల్లులను సహజంగానే తరిమికొడుతుంది. దీనిని ప్రధాన ద్వారం, కిటికీలు , వంటగది దగ్గర కుండీల్లో నాటడం వల్ల ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. లావెండర్ మొక్క ఇంటి లోపల , బయట కుండీలలో సులభంగా పెంచవచ్చు. దీని ఘాటైన పూల సువాసన బల్లులను గోడలకు దరిచేరనివ్వదు. అవసరమైతే లావెండర్ ఆయిల్ చుక్కలను నీటిలో కలిపి ఇల్లంతా స్ప్రే చేయడం వల్ల కూడా ఒక్క బల్లి కూడా ఇంట్లో కనిపించకుండా పారిపోతుంది. ఈ విధంగా సహజమైన మొక్కల సహాయంతో మీ ఇంటిని బల్లుల రహితంగా మార్చుకోవచ్చు.
