AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేల..సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక!

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. కొందరు కేటుగాళ్లు తాము ఆర్మీ అధికారులమంటూ విరాళాల పేరుతో సందేశాలు పంపుతూ అమాయక ప్రజల నుంచి డబ్బు దోచుకుంటున్నారని ఆయన ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేల..సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక!
Vc.sajjanar
Anand T
|

Updated on: May 09, 2025 | 12:52 PM

Share

దేశ ప్రజల కోసం ఓ వైపు భారత సైన్యం పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు కొందరు కేటుగాళ్లు వాళ్ల పేర్లు చెప్పి అమాయక ప్రజ నుంచి దబ్బులు దండుకుంటున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేల కొందరు కేటుగాళ్లు కొత్త మోసాని తెరలేపారు. తాము ఆర్మీ అధికారులమని, ఉద్రిక్తల నేపథ్యంలో తమకు ఆర్థిక సహాయం చేయాలని అమాయక ప్రజలకు మెసెజ్‌లు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు.

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ నయా మోసంపై తెలంగాణ రాష్ట్ర రోడ్‌ రవాణా సంస్థ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ విరాళాల కోసం ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. అందువల్ల విరాళాలు ఇవ్వాలని మెసెజ్‌లలో కేటుగాళ్లు ప్రజలను కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ మెసెజ్‌లు నిజమని నమ్మి కొంత మంది డబ్బులు చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీసీ సజ్జనార్ ప్రజలను సూచించారు.

తాము ఆర్మీ అధికారులమని ఎవరైన విరాళాల పేరుతో మెసెజ్‌లు చేసినా, నేరుగా వచ్చి అడిగా ప్రజలు తొందర పడి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. వాళ్లపై మీకు ఎదైనా సందేహం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. దేశభక్తిని అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు కాజేసే ఇలాంటి కేటుగాళ్ల బారిన ప్రజలు పడొద్దని ఆయన హెచ్చరించారు. విరాళాలు ఏవైన ఇవ్వాల్సి వస్తే.. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం తీసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్..
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..