AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికలా నేను చేయలేను.. నేషనల్ క్రష్‌పై టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

రష్మిక మందన్నా సక్సెస్ కేవలం అదృష్టం కాదని, అది ఆమె అపారమైన కృషి, విశిష్టమైన ప్రతిభకు నిదర్శనమని ఈ స్టార్ హీరోయిన్ ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ సూపర్బ్ అంటూ అందరూ రష్మిక మందన్నా కాలేరని నేషనల్ క్రష్ కు కితాబిచ్చిందీ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna: రష్మికలా నేను చేయలేను.. నేషనల్ క్రష్‌పై టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 5:32 PM

Share

సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్న ఎదుగుదలను చూసి చాలామంది దానిని కేవలం ‘అదృష్టం’ అని అంటుంటారు. అయితే, ఈ రోజు రష్మిక ఈ స్థాయికి ఎదగడం వెనుక ఆమె స్వయం కృషి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆమె కృషిని, నటనను గుర్తించి, గౌరవించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ప్రముఖ దక్షిణాది నటి ఐశ్వర్య లక్ష్మి కూడా అదే జాబితాలో చేరింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె రష్మిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. “ప్రతి ఒక్కరూ రష్మిక మందన్నలా ఉండలేరు. రష్మిక చేసేది నేను ఖచ్చితంగా చేయలేను. ఆమె సినిమాల్లో చాలా అద్భుతంగా నటిస్తుంది. ఆమె తన అందం, అభినయంతో వెండి తెరపై మాయం చేస్తోంది. రష్మిక చాలా కమర్షియల్ చిత్రాలు చేసింది, అలాగే విభిన్న పాత్రలలో కూడా నటించింది. అన్నింటికన్నా ముఖ్యంగా, నేను రష్మిక అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయలేను’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. ఐశ్వర్య లక్ష్మి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక కేవలం అదృష్టంతో అగ్రస్థానానికి రాలేదని, తన కఠోర శ్రమతో ఈ స్థానాన్ని సాధించిందని చెప్పడానికి ఈ మాటలే నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పెద్ద సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఒక భారీ మార్కెట్‌ను సృష్టించుకుందీ అందాల తార. రష్మిక మందన్న రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘మైసా’ అనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో పాటు తన భర్త విజయ్ దేవరకొండతో కలిస రణబాలి అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. గతంలో విజయ్ తో ట్యాక్సీవాలా వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఐశ్వర్య లక్ష్మీ విషయానికి వస్తే.. తమిళ హీరోయినే అయినా తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. ముఖ్యంగా ఆమె నటించిన మట్టి కుస్తీ సినిమా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్నసంబరాల ఏటి గట్టు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య.

మట్టి కుస్తి 2 సినిమాలో ఐశ్వర్య లక్ష్మి..

View this post on Instagram

A post shared by Sun Music (@sunmusic_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాల్లో భారీ స్కామ్..!
పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాల్లో భారీ స్కామ్..!
క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్.. దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..?
క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్.. దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..?