AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 15మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్..?

Team India ODI World Cup 2027: గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ యువతరం ఉత్సాహాన్ని, సీనియర్ల అనుభవాన్ని సమతూకం చేస్తూ ప్రపంచకప్ వేటను ప్రారంభించింది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా లభించే ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ 15 మంది ఆటగాళ్లే మరిన్ని మెరుగులు దిద్దుకుని 2027 లో భారత్‌కు ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు.

Team India: 15మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్..?
Team India Odi World Cup 2027
Venkata Chari
|

Updated on: Jun 25, 2026 | 5:48 PM

Share

Team India ODI World Cup 2027: వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టును పరిశీలిస్తే.. రాబోయే ప్రపంచకప్‌లో భారత్ తరపున బరిలోకి దిగే 15 మంది ఆటగాళ్లు ఎవరనేదానిపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్.. మెగా టోర్నీకి అసలైన పునాది!

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్ పర్యటన కోసం బలిష్టమైన వన్డే జట్టును ప్రకటించింది. జూలై 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కేవలం ద్వైపాక్షిక సమరం మాత్రమే కాదు.. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌నకు పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు. జట్టులో సీనియర్ల పునరాగమనం, కుర్రాళ్ళకు దక్కిన అవకాశాలను బట్టి చూస్తే, రాబోయే నాలుగేళ్ల పాటు వన్డేల్లో కొనసాగే కోర్ టీమ్ ఇదేనని స్పష్టమవుతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో సెలెక్షన్ కమిటీ దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఈ అడుగులు వేసింది.

సీనియర్ల రీఎంట్రీ.. యువ కిరణాలకు నిరాశ!

ఈ సిరీస్ కోసం భారత జట్టులోకి రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ తిరిగి వచ్చారు. అయితే, అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డేలో కేవలం 86 బంతుల్లో 110 పరుగులతో అద్భుత శతకం బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జైస్వాల్ స్థానంలోనే కోహ్లీ జట్టులోకి వచ్చారు. వీరితో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అఫ్గాన్ సిరీస్‌లో ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే వంటి యువ ఆటగాళ్లను సీనియర్ల కోసం పక్కన పెట్టక తప్పలేదు. మెగా టోర్నీల అనుభవం దృష్ట్యా పెద్ద లీగ్‌లలో సీనియర్లకే గంభీర్ మొగ్గు చూపుతారని దీన్నిబట్టి అర్ధమవుతోంది.

హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్.. నితీష్ రెడ్డికి లక్కీ ఛాన్స్!

ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్లే నితీష్‌కు ఈ అవకాశం దక్కింది. అయితే, ప్రపంచకప్ 2027 నాటికి హార్దిక్ పాండ్యా గనుక పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టులో ఆయనకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్‌లలో హార్దిక్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉన్నందున, ఆయన జట్టులో ఉండటం ఖాయం. ఒకవేళ హార్దిక్ అందుబాటులో లేకపోతే బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా నితీష్ రెడ్డి రేసులో నిలుస్తారు.

ప్రపంచకప్ 2027 రేసులో ఉండే ఆ 15 మంది అంచనా జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాల్లో భారీ స్కామ్..!
పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాల్లో భారీ స్కామ్..!