AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు తేదీలు ఇవే!

TG PGLCET 2026: తెలంగాణలో 3 సంవత్సరాల, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, 2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుండగా, వెబ్ ఆప్షన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు తేదీలను అధికారులు ప్రకటించారు.

టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు తేదీలు ఇవే!
Tg Lawcet & Pglcet 2026 Counselling Schedule
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 5:32 PM

Share

TG LAWCET 2026: తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ (LAWCET), టీజీ పీజీఎల్‌సెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ వేదికగా కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి షెడ్యుల్ విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జూన్ 26 విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.

షెడ్యూల్ ప్రకారం టీజీ లాసెట్ (3YDC & 5YDC) కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్కాన్ చేసిన సర్టిఫికేట్ల అప్‌లోడింగ్ ప్రక్రియ జూలై 5, 2026 నుంచి జూలై 10, 2026 వరకు కొనసాగుతుంది. అలాగే టీజీ పీజీఎల్‌సెట్ కోర్సు అభ్యర్థులకు జూలై 27, 2026 నుంచి జూలై 31, 2026 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశాల డైరెక్టరేట్ వేదికగా భౌతిక ధృవీకరణ ప్రక్రియ జరుగుతుంది. లాసెట్ ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు జూలై 6 నుంచి జూలై 9 వరకు, పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు జూలై 29 నుంచి జూలై 31 వరకు స్లాట్ బుకింగ్ ద్వారా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ విషయానికి వస్తే..

లాసెట్ అభ్యర్థులు జూలై 16 నుంచి జూలై 19, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూలై 20న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. అనంతరం జూలై 24, 2026న ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 25 నుండి జూలై 28 వరకు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు రశీదుతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు ఆగస్టు 1 నుండి ఆగస్టు 2, 2026 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. వీరు ఆగస్టు 5 నుండి ఆగస్టు 8, 2026 లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం