AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. ఎందుకంటే రేపటి నుండి అంటే జూన్ 26 అర్ధరాత్రి నుండి మూడు రోజుల పాటు ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మీరు అత్యవసరంగా పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలన్నా.. లేదా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా కుదరదు. మళ్లీ సేవలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అనేది తెలుసుకుందాం..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Epfo Online Services Unavailable Till June 26 To 28
Krishna S
|

Updated on: Jun 25, 2026 | 5:50 PM

Share

సంస్థలలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎప్ ఉండడం కామన్. ఇది అత్యవసర సమయాల్లో ఆదుకునే బంగారు నిధి వంటిది. పీఎఫ్‌కు సంబంధించి ఈపీఎఫ్‌వో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. మీరు పీఎఫ్‌కి సంబంధించి ఏదైనా పని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈపీఎఫ్‌ఓ తన ఆన్‌లైన్ పోర్టల్‌లో మూడు రోజుల పాటు కొన్ని కీలక సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్, డేటాబేస్ అప్‌గ్రేడేషన్ పనుల కారణంగా ఈ తాత్కాలిక అంతరాయం కలగనుంది. నివేదికల ప్రకారం.. జూన్ 26 అర్ధరాత్రి 12 గంటల నుండి జూన్ 28 రాత్రి 11:59 గంటల వరకు ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో పీఎఫ్ క్లెయిమ్‌లకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండవు. మళ్లీ జూన్ 29 నుంచి అన్ని సేవలు యథావిధిగా, మరింత వేగంగా అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

ఏయే సేవలకు బ్రేక్ పడనుంది?

కొత్త క్లెయిమ్‌లు: ఈ 3 రోజుల పాటు ఖాతాదారులు కొత్తగా ఎలాంటి పీఎఫ్ క్లెయిమ్‌లను సబ్మిట్ చేయలేరు.

పాత క్లెయిమ్‌ల ప్రాసెసింగ్: ఇప్పటికే దాఖలు చేసిన క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల పాత క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌కు మరికొన్ని రోజులు అదనంగా సమయం పట్టే అవకాశం ఉంది.

ఉమాంగ్ యాప్‌పైనా ప్రభావం..

మొబైల్ ద్వారా పీఎఫ్ సేవలను అందించే ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ సేవలు కూడా మెయింటెనెన్స్ కారణంగా జూలై 2 వరకు ప్రభావితం కానున్నాయి. దీనివల్ల యాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ చూడటం, యూఏఎన్ సేవలు, జీవన్ ప్రమాణ్ పత్ర వంటి సేవలకు ఆటంకం కలగనుంది.

8.25శాతం వడ్డీ రేటుకు ఆమోదం

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2025-26 కి గానూ ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేసింది. అర్హులైన ఖాతాదారులందరికీ త్వరలోనే ఈ వడ్డీ జమ కానుంది.

పోర్టల్ బంద్ అయితే.. బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?

ఆన్‌లైన్ పోర్టల్ లేదా యాప్ పని చేయకపోయినా.. ఖాతాదారులు ఈ క్రింది ప్రత్యామ్నాయాల ద్వారా సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కి మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.

SMS ద్వారా: మీ మొబైల్ నుండి 7738299899 నంబర్‌కు EPFOHO UAN ENG అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో వివరాలు కావాలంటే చివరి మూడు అక్షరాలను TEL గా మార్చాలి.

Follow Us
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు అన్నీ సేవలు బంద్..
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
15మందితో వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
రష్మికలా నేను చేయలేను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
ఒక్క రోజుకు లక్ష పారితోషికమా.. ? అసలు విషయం చెప్పిన వంటలక్క..
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
భారత పౌరసత్వానికి అసలైన రుజువు పత్రం ఏది?
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు..
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు రోహిత్ చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..
జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందా..? డోంట్ వర్రీ..