AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలో ప్రత్యక్షమైన సాగర కన్యలు.. వావ్ అనిపించే అండర్ వాటర్ ఎగ్జిబిషన్.. పూర్తి వివరాలు..

సాగర కన్యలు, మత్స్యకన్యలు, అరుదైన చేపలు ఇవన్నీ వినడానికి మాత్రమే లేదా సినిమాల్లో చూడటం తప్ప నిజంగా చూసిన వారెవరు లేరు.. కానీ హైదరాబాద్ నడిబొడ్డున సాగర కన్యలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి జలకన్యలు ఉన్నది వాస్తవమా? కాదా అనేది పక్కన పెడితే.. దేశంలోనే మొదటిసారిగా సాగర కన్య జల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంటుంది.

నగరంలో ప్రత్యక్షమైన సాగర కన్యలు.. వావ్ అనిపించే అండర్ వాటర్ ఎగ్జిబిషన్.. పూర్తి వివరాలు..
Under Water Exibition
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 23, 2024 | 3:49 PM

Share

సాగర కన్యలు, మత్స్యకన్యలు, అరుదైన చేపలు ఇవన్నీ వినడానికి మాత్రమే లేదా సినిమాల్లో చూడటం తప్ప నిజంగా చూసిన వారెవరు లేరు.. కానీ హైదరాబాద్ నడిబొడ్డున సాగర కన్యలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి జలకన్యలు ఉన్నది వాస్తవమా? కాదా అనేది పక్కన పెడితే.. దేశంలోనే మొదటిసారిగా సాగర కన్య జల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంటుంది. అరుదైన చేపలు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన జలకన్యలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా కూకట్‎పల్లిలో ఏర్పాటుచేసిన అండర్ వాటర్ టెన్నల్ ఎగ్జిబిషన్ మెర్మైడ్ షో మాత్రం మనం చూస్తున్నది నిజమేనా కాదా అని అనిపించేలా ఆకట్టుకుంటుంది. సాగర కన్యల జల ప్రదర్శనలో అరుదైన చేపల ప్రదర్శన స్కూబా డ్రైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో నగరవాసులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కథలలో మాత్రమే చెప్పుకునే సాగర కన్యల ప్రదర్శన దేశంలోనే మొట్టమొదటిసారి అని చెబుతున్నారు నిర్వహకులు. ఈ ప్రదర్శన కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శన ఇచ్చే ఫిలిప్పీన్‎కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మెర్మైడ్‎గా పిలుచుకునే వీరు సాగర కన్య డ్రెస్సింగ్‎తో ఎనిమిదివేల చదరపు అడుగుల విస్ట్రీర్ణం‎లో స్పెషల్‎గా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్‎లో ఆక్సిజన్ లేకుండా స్విమ్మింగ్ చేస్తూ ప్రదర్శన చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ షోలో గతంలో దుబాయ్, థాయిలాండ్, హాంకాంగ్ లాంటి దేశాల్లో మాత్రమే కనిపించేవి. కానీ మొట్టమొదటిసారిగా హైదరాబాదులో ఈ షో నిర్వహించడంతో విజిటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షో కోసం సింగపూర్, మలేషియాతో పాటు అమెజాన్ నది నుంచి 600 అరుదైన చేపలు తీసుకొచ్చారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ స్కోబెర్ డ్రైవింగ్ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. మరో నెల రోజులపాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతోందని నిర్వాహకులు తెలుపుతున్నారు. సాగర కన్యల ప్రదర్శన మాత్రం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పూర్తి షో కి టికెట్ పెద్దవాళ్ళకి రూ. 150 రూపాయలు పిల్లలకి రూ. 120 రూపాయలుగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..