ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై టీవీ9 కథనాలకు స్పందన.. నేటి నుంచి రంగంలోకి ఆర్టీఏ

ఇప్పుడు హైదరాబాద్‌లో ఉదయాన్నే యాక్సిడెంట్లు.. ట్రాఫిక్‌జామ్‌లు చూస్తుంటే పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది..! హెవీ లారీలు.. ఓవర్‌లోడ్‌తో వెళ్లే టిప్పర్లు.. ట్రావెల్స్‌ బస్సులు.. పొద్దుపొద్దున్నే జనాన్ని భయపెడుతున్నాయి..! ఎన్ని రూల్స్‌ ఉన్నా డ్రైవర్లెవరూ వీటిని పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘనలు.. ఓవర్‌ స్పీడ్‌ డ్రైవింగులే ప్రజల ప్రాణాలు హరింపజేస్తున్నాయి. ఇలాంటి ఘోరలకు చెక్‌ పెట్టేందుకు టీవీ9 చేపట్టిన ఫ్యాక్ట్‌ చెక్‌ ఆర్టీఐ అధికారులను నిద్రలేపింది. హెవీ వెహికిల్స్‌, లారీల డ్రైవర్లకు కన్నువిప్పు కలిగేలా చేసింది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై టీవీ9 కథనాలకు స్పందన.. నేటి నుంచి రంగంలోకి ఆర్టీఏ
Traffic Violations
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 19, 2024 | 12:07 PM

రెండు రోజుల కిందట హబ్సిగూడలో టిప్పర్‌ బీభత్సానికి స్కూల్‌కి వెళ్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక బలైపోయింది. దీనికి కారణం.. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా సిటీలో యధేచ్ఛగా లారీలు తిరుగుతుండడమే. ఓవర్‌ స్పీడ్‌తో వచ్చిన టిప్పర్‌ ఆటోను డీకొట్టడంతో సాత్విక చనిపోయింది. ఇలాంటి యాక్సిడెంట్లు సిటీలో ఏదో చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి..! వీటికి అడ్డుకట్ట వేసే బాధ్యత ఎవరిది..! దీనిపైనే టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌ చేపట్టింది.. నిర్ణీత సమయం తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తూ సిటీలోకి వరదలా వస్తున్న వాహనాల్ని ఫోకస్‌ చేస్తూ వాస్తవాలు చూపించింది.. దీంతో RTA అధికారులు రియాక్ట్ అయ్యారు. రెగ్యులర్‌గా తనిఖీలు చేపడతామని చెప్పుకొచ్చారు.

నగర రోడ్లపై ఉదయం 8 దాటాక లోకల్‌ లారీలు కానీ.. హెవీ వెహికిల్స్ కానీ, ట్రావెల్స్ బస్సులు కానీ సిటీలోకి రావడానికి వీల్లేదు.. కానీ.. హైదరాబాద్‌లో అడుగడుగునా ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కనిపిస్తుంటాయి. లారీలు, టిప్పర్లకు సిటీలో రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకే అనుమతి.. ఆ తర్వాత నో ఎంట్రీ. ఇక భారీ వాహనాలైతే 24X7 అనుమతి లేదు. ప్రైవేట్‌ బస్సులు రాత్రి 10 తర్వాతే రోడ్డెక్కాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి సిటీలోకి వచ్చేవాటికి ఉదయం 8 వరకే అనుమతి.. ఆ తర్వాత కూడా రోడ్లపై ఇవి కనిపిస్తూనే ఉంటాయి.

రోజూ ఉదయం స్కూల్‌ బస్సులు, కార్లు, మిగతా వాహనాలకు.. ఈ లారీలు, ట్రావెల్స్ బస్సులు కూడా తోడవుతుండడంతో జంక్షన్లు జామ్ అవుతున్నాయి. త్వరగా వెళ్లాలనే ఈ హడావుడిలో ఓవర్‌స్పీడ్‌తో ప్రమాదాలూ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని 94 రూట్లలో లారీలు, ప్రైవేట్‌ బస్సులపై ఆంక్షలు ఉన్నాయి. ఇకపై రెగ్యులర్‌గా చెకింగ్స్ చేస్తూ.. హెవీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెడతామని RTA అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!
దువ్వాడ రూ. 2 కోట్లు ఇవ్వాలి.. మాధురి సంచలన వ్యాఖ్యలు..
దువ్వాడ రూ. 2 కోట్లు ఇవ్వాలి.. మాధురి సంచలన వ్యాఖ్యలు..
జియోలో మీకు నచ్చిన నంబర్‌ సిమ్‌ కావాలా? ఇలా చేయండి!
జియోలో మీకు నచ్చిన నంబర్‌ సిమ్‌ కావాలా? ఇలా చేయండి!
మెట్రోలోనే దుకాణం పెట్టారు.. ముద్దులతో రెచ్చిపోయిన జంట..
మెట్రోలోనే దుకాణం పెట్టారు.. ముద్దులతో రెచ్చిపోయిన జంట..
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆహారాలను తీసుకెళ్లడం మర్చిపోవద్దు
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆహారాలను తీసుకెళ్లడం మర్చిపోవద్దు
ఏపీలో ఉద్యోగాల జాతర.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఆ సంస్థ..
ఏపీలో ఉద్యోగాల జాతర.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఆ సంస్థ..
బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో నటించింది ఈ బ్యూటీ..
బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో నటించింది ఈ బ్యూటీ..
సుగంధ పాల వేర్ల ఉపయోగం, రహస్యం తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
సుగంధ పాల వేర్ల ఉపయోగం, రహస్యం తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
కొవ్వును కరిగించే మ్యాజిక్ డ్రింక్స్.. రాత్రి తాగితే పొట్ట మాటష్
కొవ్వును కరిగించే మ్యాజిక్ డ్రింక్స్.. రాత్రి తాగితే పొట్ట మాటష్
ఇంగ్లండ్‌తో ఇదరగీశారు.. బంగ్లాతో సిరీస్‌కు మాయమయ్యారు
ఇంగ్లండ్‌తో ఇదరగీశారు.. బంగ్లాతో సిరీస్‌కు మాయమయ్యారు