Hyderabad: వినాయక విగ్రహ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు.. పీఓపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో
పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తయారీదారులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కొట్టివేయాలన్న పిటిషనర్ల కోరికను కోర్ట్ తప్పుపట్టింది. వేణు మాధవ్ అనే న్యాయవాది.. గతేడాది హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు కోర్టుకు తెలిపారు. అయితే...
వినాయక చవితి వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు ఎంతో సంబురంగా జరుగుతాయని తెలిసిందే. ఇంట్లో జరుపుకునే వేడుకలు ఒకెత్తయితే, గణేష్ మండపాల్లో జరిగే వేడుకలు మరో ఎత్తు. చిన్నా పెద్దా తేడా లేకుండా వినాయక చవితి వేడుకల్లో సంతోషంగా పాల్గొంటారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రతీ ఏటా వినాయక చవితి నిమజ్జనం గురించి చర్చ జరుగుతుందనే విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో కోర్టులు నిబంధనలు విధిస్తూనే ఉంటాయి.
వాతావరణ పరిరక్షణకు గాను పీఓపీతో తయారు చేసే విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని ఆదేశాలు జారీ చేస్తుంటారు. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని గతేడాది తెలంగాణ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. అయితే ఈ ఏడాది కూడా ఇవే నిబంధనలు కొనసాగుతాయని కోర్ట్ స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులను ఉపయోగించాలని ఆదేశించింది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ ఏడాదికి కూడా కొనసాగుతాయని ఉన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది.
పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తయారీదారులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కొట్టివేయాలన్న పిటిషనర్ల కోరికను కోర్ట్ తప్పుపట్టింది. వేణు మాధవ్ అనే న్యాయవాది.. గతేడాది హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు కోర్టుకు తెలిపారు. అయితే తగిన ఆధారాలతో ఎవరైనా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. పీఓపీ విగ్రహాల తయారీదారులు వేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 25 తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈసారి చవితి ఎప్పుడంటే..
ఇదిలా ఉంటే ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడన్నదానిపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈసారి చవితి 18, 19 తేదీల్లో ఎప్పుడన్న దానిపై అయోమయం నెలకొంది. అయితే దీనిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారికంగా తెలిపింది. 28వ తేదీన గణేష్ మహా నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. వినాయక చవితి ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో భాగ్య నగర్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు ఈ విషయాన్ని వెల్లించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..