లాక్‌డౌన్‌ సడలింపులు.. భవన నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..!

ఈ ఆదివారంతో లాక్‌డౌన్‌ 2.O ముగియనున్న వేళ.. కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భవన నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

లాక్‌డౌన్‌ సడలింపులు.. భవన నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..!
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 10:20 PM

ఈ ఆదివారంతో లాక్‌డౌన్‌ 2.O ముగియనున్న వేళ.. కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భవన నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. రియల్ ఎస్టేట్‌, భవన నిర్మాణ రంగ ప్రతినిధులతో తెలంగాణ సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్మాణాలకు కావాల్సిన మెటీరియల్స్‌ సమకూర్చుకోవాలని సీఎస్ నిర్మాణరంగ ప్రతినిధులకు తెలిపారు. మరోవైపు ఇనుము, సిమెంట్‌, ఇసుక, కంకర తదితర సరుకుల్ని రవాణా చేసే వాహనాలను ఆపొద్దంటూ డీజీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మెటీరియల్‌ సజావుగా చేరేందుకు మూడు కమిషనరేట్ల పరిధిలో రవాణాకు ఇబ్బంది లేదని ఆయన నిర్మాణ రంగ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో తెలంగాణలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

దీనిపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు జీహెచ్‌ఎంసీ నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్మికుల పట్ల కరోనా నిరోధక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లు, యాజమాన్యులకే ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రెండో దశలో ఇతర నిర్మాణాలకు అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇంట్లో ఒక్కరికే పాస్‌..!

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం