CM KCR: తగ్గేదెలే.. కేంద్రంతో తేల్చుకునుడే.. ఎంపీలతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం..

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో..

CM KCR: తగ్గేదెలే.. కేంద్రంతో తేల్చుకునుడే.. ఎంపీలతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం..
Cm Kcr Trs
Follow us

|

Updated on: Jan 30, 2022 | 5:12 PM

TRS Parliamentary Party Meeting: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (TRS parliamentary party) సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meeting 2022) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యుహాంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశంలో.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించ్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలు చేస్తున్నారు.కేంద్రంతో ఇక యుద్ధమే అని ఎంపీ లతో తెల్చి చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తో అమీతుమీకి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సుదీర్ఘ చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన వినతులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించనున్నారు. అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఈనెల 31 సోమవారం నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి.

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో సానిటేషన్‌ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇక, పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్‌ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ సమాధానంపై టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..

PM Modi: ఎన్‌సీసీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోడీ తలపాగ.. దీని ప్రత్యేకత ఎంటో తెలుసా..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..