CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (TRS parliamentary party)సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో..

CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..
TRS Leaders
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 30, 2022 | 8:29 PM

TRS Parliamentary Party Meeting: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (TRS parliamentary party)సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో మొదలైన ఈ సమావేశం సాయంత్రం వరకు సుదీర్ఘంగా సాగింది. రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meeting 2022) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యుహాంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశంలో.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించ్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలు చేశారు.కేంద్రంతో ఇక యుద్ధమే అని ఎంపీ లతో తెల్చి చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తో అమీతుమీకి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సుదీర్ఘ చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన వినతులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై సీఎం ఎంపీలతో చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ చర్చించారు. కేంద్రంపై అనుసరించాల్సిన వ్యవహారంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఆ నివేదికను సీఎం కేసీఆర్ అందించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు.

ఇక, ఈనెల 31 సోమవారం నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి.

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో సానిటేషన్‌ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇక, పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్‌ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ సమాధానంపై టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..

PM Modi: ఎన్‌సీసీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోడీ తలపాగ.. దీని ప్రత్యేకత ఎంటో తెలుసా..